Sunday, December 29, 2024

“మిస్టర్ ఇడియ‌ట్‌” ‘కావాలయ్యా..’ లిరికల్

మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా న‌టిస్తోన్న‌ సినిమా “మిస్టర్ ఇడియ‌ట్‌”. ఈ చిత్రంలో సిమ్రాన్ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. జేజేఆర్ ఎంటర్ టైన్ మెంట్స్ ఎల్ఎల్ పీ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్ “మిస్టర్ ఇడియ‌ట్‌” సినిమాను నిర్మిస్తున్నారు. పెళ్లి సందడి చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సోషల్ మీడియా ద్వారా “మిస్టర్ ఇడియ‌ట్‌” సినిమా నుంచి ‘కావాలయ్యా..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘కావాలయ్యా..’ సాంగ్ కంపోజిషన్, పిక్చరైజేషన్ చాలా బాగుందన్న తమన్..హీరో మాధవ్ తో పాటు ఎంటైర్ మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ అందించారు. ‘కావాలయ్యా..’ పాటను అనూప్ రూబెన్స్ మంచి బీట్ తో కంపోజ్ చేయగా భాస్కరభట్ల క్యాచీ లిరిక్స్ అందించారు. గాయని మంగ్లీ ఎనర్జిటిక్ గా పాడారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com