సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థానాన్ని సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్ మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది. అయితే మృణాల్ చివరగా విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ సినిమాతో ఆడియన్స్ ను పలకరించింది. ప్రస్తుతం మృణాల్ అడివి శేష్ తో కలిసి డెకాయిట్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో మృణాల్ ఫస్ట్ లుక్ ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మృణాల్ ఫస్ట్ లుక్ తర్వాత డెకాయిట్ నుంచి ఎలాంటి అప్‌డేట్ వచ్చింది లేదు. దీంతో ఈ సినిమా అప్డేట్స్ తెలుసుకోవాలని ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మృణాల్ డెకాయిట్ గురించి అప్డేట్ ఇచ్చింది. పేపర్ వెయిట్‌ను చేత్తో గుండ్రంగా తిప్పుతూ తాను డెకాయిట్ షూట్ లో ఉన్న విషయాన్ని వెల్లడించింది మృణాల్. ఇప్పటివరకు రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామా సినిమాల్లో నటించిన మృణాల్ కు ఈ సినిమా పూర్తి భిన్నంగా ఉండనుంది. మృణాల్ నటిస్తున్న మొదటి థ్రిల్లర్ సినిమా డెకాయిట్. ఫస్ట్ లుక్ లో మృణాల్ ను చూసి షాకైన అభిమానులు ఈ యాక్షన్ థ్రిల్లర్ లో అమ్మడిని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్నారు. పోస్టర్ లో మృణాల్ లుక్ చాలా భీకరంగా కనిపించడంతో డెకాయిట్ పై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. ఇదిలా ఉంటే డెకాయిట్ మూవీతో షానీల్ డియో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు.