Friday, January 10, 2025

మంటలు పుట్టిస్తున్న మృణాల్‌

హీరోయిన్‌ అంటే ఒక్కోక్కరు ఒక్కో స్టైల్లో ఉంటారు. కొందరు పాష్‌గా ఉంటే… మరికొందరు ట్రెడిషనల్‌గా ఉంటారు. ఇంకొందరు ఎలా ఉన్నా కూడా హాట్‌గా కనిపిస్తుంటారు. కొంతమంది తమ అందంతో గుర్తింపు పొందితే మరికొందరు తమ పెర్ఫార్మెన్స్‌తో గుర్తింపుని తెచ్చుకుంటారు. ఇవన్నీ మిక్సడ్‌ లక్షణాలు మిక్స్ అయిన హీరోయిన్లు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఇక అలాంటివారిలో బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ ఈ కోవకే చెందుతుంది. సీతారామం, హాయ్ నాన్న సినిమాల్లో ఆమె ఎంత అందంగా కనిపించిందో తెలిసిందే. అసలు ట్రెడిషనల్‌ లుక్‌లో సూపర్బ్‌గా అనిపించింది. ఆ సినిమాల్లో ఆమె పర్ఫామెన్స్ కూడా అదే రేంజ్‌లో ఉంది. అలాగు ఇటు బాలీవుడ్‌ విషయానికి వస్తే ఆమె నటించిన కొన్ని సినిమాలు చూస్తే మృణాల్ ఎంత హాట్‌ గురూ అనిపిస్తుంది. చాలావరకు ట్రెడిషనల్ గా కనిపించడానికి ప్రయత్నించే మృణాల్ అప్పుడప్పుడు ఈ హాట్ అవతారాల్లో సెగలు రేపుతూ ఉంటుంది.
తాజాగా మృణాల్ అలాంటి ప్రయత్నమే చేసింది. ఫిలిం ఫేర్ అవార్డుల వేడుకలో ఆమె మంటలు పుట్టించింది. ఈ వేడుకకు ఆలియా భట్, జాన్వీ కపూర్ సహా చాలామంది ప్రముఖ హీరోయిన్లు హాజరయ్యారు. తమ అందచందాలతో ఆకట్టుకున్నారు. కానీ మృణాల్ మాత్రం వాళ్ళందర్నీ మించి అందరి దృష్టిని ఒక్కసారిగా తనవైపు లాగేసుకుంది. అందంగా కనిపిస్తూనే క్లీవేజ్ షోతో కెమెరాల దృష్టిని తన వైపు తిప్పుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలోకి రావడంతో వెంటనే వైరల్ అయిపోయాయి.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com