Friday, February 21, 2025

మూడు కాకపోతే ముప్పై కేసులు పెట్టుకోండి

– నారా లోకేష్ రెడ్ బుక్‌పై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు
– మా దగ్గర చాలా మంది లాయర్లు ఉన్నారు
– రెడ్‌బుక్‌..బ్లూబుక్‌లు చాలా చూశాం
– వల్లభనేని వంశీ అరెస్ట్‌ కామన్‌

కొడాలి నాని ఈయన పేరు వింటేనే హడల్‌. ఓ డిఫరెంట్‌ వేలో మాట్లాడుతుంటారు ఈయన. నారా లోకేష్‌ రెడ్‌ బుక్‌ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నాని. విజయవాడ సబ్ జైలు వద్దకు వచ్చిన నాని జైలు లోపలికి వెళ్లడానికి అధికారులు అనుమతి ఇవ్వలేదు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుత… ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, అందులో భాగంగా తమ పార్టీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తుంన్నారు. విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ చెప్పే రెడ్ బుక్ గురించి మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రెడ్ బుక్ చూడలేదు అని, అందులో తన పేరు ఉందో లేదో తెలియదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మాజీ సీఎం జగన్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ములాఖత్ అయ్యేందుకు వచ్చిన సమయంలో కొడాలి నాని సైతం జైలు వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి యాక్టివ్ గా మాట్లాడాం, ఇప్పుడు మా ఉద్యోగాలు పోయాయి (ఎమ్మెల్యేలుగా ఓడిపోయాం) ఇంకేం మాట్లాడతాం?. అని ఆయన సమాధానమిచ్చారు. ఈ అరెస్టులు ఇవన్ని చాలా చిన్న విషయాలన్న కొడాలి నాని, తమ మీద 3 కాకపోతే 30 కేసులు పెట్టుకోండి అంటూ కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. బయట కనిపించడం లేదేంటి అని అడిగిన ప్రశ్నకు మీకు… రాధాకృష్ణకు, టీవీ5 నాయుడి అడ్రస్‌ ఇస్తే ప్రతి రోజు వచ్చి కనిపించి వెళతానని కాస్త వెటకారంగా ఆయన సమాధానమిచ్చారు. సాధారణంగా ఆయన మాటలు వ్యంగంగా ఉంటాయి. ప్రజంట్‌ ఆయన మాటలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

నానిలను అనుమతించని జైలు అధికారులు
విజయవాడ జిల్లా సబ్ జైల్ లోపలికి మాజీ మంత్రులు, వైసీపీ కీలక నేతలు కొడాలి నాని, పేర్ని నానికి జైలు అధికారులు అనుమతి నిరాకరించారు. నేటి ములాఖత్ లో వల్లభనేని వంశీని జైలులోకి వెళ్లి పరామర్శించేందుకు అనుమతి నిరాకరించారు. మాజీ సీఎం జగన్ తో కలిసి జైల్లోకి వెళ్లేందుకు సింహాద్రి రమేష్ ను అనుమతించారు. అయితే ములాఖత్ లో వంశీని కలిసేందుకు జగన్ తో పాటు పేర్ని నాని, కొడాలి నాని పేర్లు ఇచ్చినట్లు సమాచారం. కానీ సెక్యూరిటీ కారణాలతో కొడాలి నాని, పేర్ని నానికి జైలు అధికారులు అనుమతి ఇవ్వలేదని సమాచారం.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com