ఫుల్ బిజీ.. బిజీ యాంత్రిక జీవితాల్లో ఎప్పుడన్నా ఒకసారి ఫ్యామిలీ అంతా కలిసి కూల్ అవ్వడం కోసం ఏదో ఒక సినిమాని ఎంచుకుని వెళ్ళాలనుకుంటారు. ఎంటర్‌టైన్మెంట్ కు డిమాండ్ ఎక్కువైన నేపథ్యంలో సినిమాకు వెళ్లాలనే కోరిక ఉన్నప్పటికీ ఫ్యామిలీతో కలిసి వెళ్తే ఖర్చు గురించి చూసుకుని వెనుకడుగేస్తున్నారు. దానికి కారణం పెరుగుతున్న టికెట్ రేట్లతో పాటూ పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు. అన్ని సినిమాలకు టికెట్ రేట్లు పెరగకపోయినా పాప్ కార్న్, కూల్ డ్రింక్ రేట్లు మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటున్నాయి. కనీసం రెండు వందల పాప్‌కార్న్,..కనీసం వాటర్ తాగుదామన్నా అరలీటర్ 70 నుంచి 80 రూపాయల వరకు ఉంది. ఇక జ్యూస్‌లు.. ఐస్‌క్రీమ్ వగేరా… వగేరా అయితే రేట్లు చప్పక్కర్లా 300 నుంచి 350 వరకు ఇష్టమొచ్చిన రేట్లతో ఈ మాల్స్‌వాళ్ళు సామాన్య ప్రజలను బాదేస్తుంటారు. వాటి రేటు మాస్ థియేటర్లలో ఒకలా ఉంటే మల్టీప్లెక్సుల్లో మరోలా ఉంటుంది. మల్టీప్లెక్సులో అయితే టికెట్ రేటు కంటే పాప్‌కార్న్ రేటే ఎక్కువ. ఫ్యామిలీతో కలిసి నలుగురు సినిమాకు వెళ్లాలంటే అయ్యే ఖర్చును ముందుగానే లెక్కేసుకుని వెనుకడుగేస్తున్నారు నార్మల్ ఆడియన్స్. ఈ విషయంపై సికిందర్ ప్రమోషన్స్ లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గొంతు విప్పారు. టికెట్ రేట్లు, పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లను పరిమితం చేయడానికి ఆయన తన మద్దతును తెలిపారు. అంతేకాదు ఈ ఆదాయంలో నిర్మాతలకు కూడా వాటా దక్కాలని సల్మాన్ నొక్కి మరీ చెప్తున్నారు. ఇదే సందర్భంగా దేశంలో ఉన్న థియేటర్ల కొరత గురించి కూడా సల్మాన్ మాట్లాడారు. భారతదేశంలో చాలా తక్కువ థియేటర్లు ఉన్నాయని, ఎంతలేదన్నా ఇండియా మొత్తానికి 20 వేలకు పైగా థియేటర్లు కావాలని ఆయన అన్నారు. రాజస్తాన్ లోని మండవాలో ఎంతోమంది బిలీయనీర్లు ఉన్నప్పటికీ అక్కడ మూవీ థియేటర్ లేకపోవడం వల్ల ఆ ఏరియా ప్రజలు సినిమా చూడాలంటే దాని కోసం రెండున్నర కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందని సల్మాన్ తెలిపారు. మాస్, క్లాస్ సినిమాల మధ్య తేడా రోజురోజుకీ తగ్గిపోతుందన్న సల్మాన్, మల్టీప్లెక్స్ ఆడియన్స్ కూడా థియేటర్లలో రచ్చ చేస్తున్నారని, అందుకే మాస్ థియేటర్లకు క్రేజ్ బాగా పెరిగిందని ఆయన అన్నారు. పీవీఆర్, ఐనాక్స్ లాంటి పెద్ద పెద్ద మల్టీప్లెక్సులున్న వాళ్లు కూడా మాస్ మూవీని, ఆ యుఫోరియాను ఎంజాయ్ చేయడానికి మాస్ థియేటర్లకు వెళ్లి సినిమాలు చూస్తున్నారని ఆయన అన్నారు. ఇక సల్మాన్ విషయానికొస్తే, గత కొన్ని సినిమాలుగా ఆయన నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచినవే. ఇప్పుడు ఆయన హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సికిందర్ అనే సినిమా చేశాడు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈద్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సల్మాన్ ఈ సినిమా సక్సెస్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.