Sunday, November 17, 2024

మూసీ బాధితుల ద‌గ్గ‌ర‌కు పోదామా..?

ఈ దుస్థితికి ప్రధాన కారణం కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ పార్టీలే.
లండన్, సీయోల్ కాదు…
మూసీ బాధితుల వద్దకు వెళ్లే దమ్ముందా?
మూసీ పునరుజ్జీవం అతి పెద్ద స్కామ్
వాద్రా కోసం మూసీ దోపిడీకి ప్లాన్ చేస్తారా?
ఇందిరా పార్క్ ధర్నాలో కేంద్ర మంత్రి బండి సంజయ్

మంత్రులు ఒక టీంను వెంట‌పెట్టుకుని సియోల్‌, లండ‌న్ వెళ్లార‌ని, ద‌మ్ముంటే మూసీ బాధితుల ద‌గ్గ‌ర‌కు వెళ్ద‌మా అని బీజేపీ నేత‌, కేంద్ర‌మంత్రి బండి సంజ‌య్ స‌వాల్ విసిరారు. ఇందిరాపార్క్ ద‌గ్గ‌ర ధ‌ర్నాలో కేంద్రమంత్రి మాట్లాడారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టి 287 కి.మీలు ప్రవహిస్తున్న మూసీ ఇప్పుడు డ్రైనేజీ నీటితో దాదాపు 12వేల పరిశ్రమల నుండి వెలువడే రసాయనాలతో విషంగా మారింద‌ని, త‌న పాదయాత్రలో భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో విషం చిమ్ముతూ ఎగిసిపడుతున్న మూసీని, జనం బాధలను కళ్లారా చూశాన‌న్నారు. ఈ దుస్థితికి కార‌ణం 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్సే అని మండిప‌డ్డారు. మూసీ ప్రక్షాళన ఓ జోక్ అని, 1997లో ప్రక్షాళన పేరుతో డ్రామాలు చేశార‌న్నారు. ఆనాడు కర్మన్ ఘాట్ లో ‘‘నందనవనం’, 2005లో ‘‘సేవ్ మూసీ క్యాంపెయిన్’’ పేరుతో హంగామా,నేష‌న‌ల్ రివ‌ర్ క‌న్జ‌ర్వేష‌న్ ప్లాన్‌, జైకా, జపాన్ నిధులు అంటూ దోచుకున్నార‌ని బండి సంజ‌య్ అన్నారు. కేసీఆర్‌ పాలనలో 16, 634 కోట్లతో ’మూసీ సుందరీకరణ’ డ్రామా చేశార‌ని, హుస్సేన్ సాగర్ కొబ్బరి నీళ్లు అంటూ చెప్పార‌న్నారు. మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటుతో రాజకీయ పునరావాసంగా మార్చుకున్నార‌ని, మూసీని అడ్డుపెట్టుకుని కబ్జా చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం నేతల బిల్డింగ్ ల జోలికి పోయే దమ్ముందా అని స‌వాల్ చేశారు. పేదల ఇండ్ల జోలికొస్తే ఊరుకోమ‌ని, వాళ్ల ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డమేస్తమ‌ని, బుల్డోజర్లు రావాలంటే మమ్ముల్ని దాటిపోవాలి అంటూ మూసీ బాధితుల‌కు ధైర్యం చెప్పారు. మూసీ ప్రక్షాళనకు,సబర్మతి నదితో పోలిక లేద‌న్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular