Wednesday, April 2, 2025

సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన సంగీత దర్శకుడు కీరవాణి, ప్రజాకవి అందెశ్రీలు

వారిని శాలువాతో సత్కరించిన సిఎం
సిఎం రేవంత్ రెడ్డిని సీని సంగీత దర్శకుడు ఎం. ఎం కీరవాణి, ప్రజాకవి అందెశ్రీలు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సిఎం నివాసంలో ఆయనతో వారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి వారిని శాలువాతో సత్కరించారు. బుద్ధుడి విగ్రహాలను వారికి సిఎం బహుకరించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ పాటతో ఎంఎం కీరవాణి తెలుగు ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పగా, ఈ పాటకు ఆస్కార్ అవార్డు సైతం దక్కింది.

ఈ నేపథ్యంలోనే‘జయజయహే తెలంగాణ’ పాటను కీరవాణితో పాడించే అంశంపై వారు చర్చించినట్టుగా తెలిసింది. ఈ భేటీలో రచయిత అందెశ్రీ సైతం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిఎం ప్రధాన సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, సిఎం సిపిఆర్‌ఓ ఆయోధ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com