మ్యూజిక్ మేస్ట్రో అంతే తెలియని వారుండరు. సినీ సంగీత దర్శకులలో ఒకరైన ఇళయరాజా. సంగీత విధ్వాంసకులు ఆయన సంగీతాన్ని ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు. ఇప్పటి వరకు ఆయన 1,500కు పైగా సినిమాలకు సంగీతం అందించారు. 7 వేలకు పైగా పాటలను అందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తన సంగీతానికే కాదు, తన ప్రతిభకు కూడా తాను గర్వపడతానని ఇళయరాజా అన్నారు. తనకు పొగరు ఉందని…. ఎందుకంటే టాలెంట్ ఉన్నవారికే పొగరు ఉంటుందని చెప్పారు. తన సంగీతం విని ఒక చిన్నారి తిరిగి శ్వాస తీసుకుందని… ఒకసారి తన పాట వినడానికి ఏనుగుల గుంపు వచ్చిందని అన్నారు. తన సంగీతం వినడమే ఒక కళ అని చెప్పారు. తాను కంపోజ్ చేసిన పలు పాటల ద్వారా వెస్టర్న్ క్లాసికల్ సంగీతాన్ని పరిచయం చేశానని తెలిపారు. ఇక ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతుంది. ఎంత సాధించినప్పటికీ ఒదిగి ఉండాలన్న సామెతను కొంత మంది అంటుంటే.. మరికొంత మంది మాత్రం ఆయన సాధించిన దానికి ఆ మాత్రం మాట్లాడటం తప్పేమి కాదని సమర్ధిస్తున్నారు. ఇకపోతే ఆయన ట్యాలెంట్ ఉంటే చాలు పొగరు వస్తది అన్నరు. అయితే ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన ట్యాలెంట్ ఉంటది. ఎవ్వరినీ ఎప్పుడూ చిన్న చూపు చూడకూడదు.