Sunday, April 6, 2025

Mutyalamma Temple Controversy నూతన విగ్రహాన్ని ప్రతిష్టిస్తాం

  • ముత్యాలమ్మ ఆలయ వివాదం
  • విగ్రహ అంశంలో ప్రకటించిన మాజీ మంత్రి తలసాని

ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి నూతన విగ్రహాన్ని త్వరలోనే ప్రతిష్టించనున్నట్లు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన కార్యాలయం లో ప్రముఖ దేవాలయాలకు చెందిన పలువురు పండితులు, పలువురు కుమ్మరి బస్తీ వాసులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కుమ్మరిగూడ కు పండితులతో కలిసి వెళ్ళి బస్తీ వాసులతో మాట్లాడారు.

అనంతరం అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. ముందుగా ఆయన బస్తీ వాసులు, విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అమ్మవారి విగ్రహం ద్వంసం చేయడం చాలా బాధాకరమని, దుర్మార్గపు చర్య అని పేర్కొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న సికింద్రాబాద్ ప్రాంతంలో సంఘటన జరిగిన నాటి నుండి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని విచారం వ్యక్తం చేశారు.

తనాకు ఊహ తెలిసిన తర్వాత ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులకు ముగింపు చెప్పాలని, ప్రశాంత వాతావరణంలో ప్రజలు జీవినం సాగించాలనేది తమ ఉద్దేశం అని శ్రీనివాస్ యాదవ్ వివరించారు. బస్తీవాసుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని పండితుల సూచనలు, సలహాల మేరకు నూతన అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేకం, మూడు రోజుల పాటు శాంతి పూజలు, హోమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు.

బస్తీ వాసులు ప్రతి ఇంటి నుండి అమ్మవారికి బోనాలు సమర్పిస్తామని తెలిపారు. ఎలాంటి రాజకీయ ప్రమేయాలకు అవకాశం లేకుండా పూర్తిస్థాయిలో బస్తీవాసుల సమక్షంలోనే పూజా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అమ్మవారి విగ్రహం ప్రతిష్ట, పూజల తేదీలను త్వరలోనే నిర్ణయించి ప్రకటించడం జరుగుతుందని వివరించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com