-
నా ఫోన్‌ట్యాపింగ్ చేసిండ్రు
-
కాల్రికార్డు చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేకు పంపించారు
-
మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ చిట్ చాట్
టీఎస్, న్యూస్:హనుమకొండ ఆర్డీవోపై సీఎస్ శాంతికుమారికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. తన ఫోన్ట్యాపింగ్చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేకు పంపించారని అందులో పేర్కొన్నారు. వెంటనే ఆర్డీవోపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిట్చాట్సందర్భంగా గాంధీ భవన్ లో పొన్నం మీడియాతో మాట్లాడారు. ‘ఉచిత బస్సులో ఇప్పటివరకు30 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసిండ్రు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ టఫ్ నడుస్తోంది. బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించారో చెప్పాలి. కిషన్ రెడ్డిని కేసీఆర్ అపాయింట్ చేయించాడని ఆయన చెప్పిండు. కాంగ్రెస్ లో కరవు వచ్చిందంటూ ప్రతిపక్ష నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నరు. కేటీఆర్ ప్రతీది రాజకీయం చేయాలని చూస్తుండు. పంట నష్టంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అనే మాట పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి మాట్లాడిండు. పార్టీ, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ గురించి పార్టీ ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ చూసుకుంటారు. నా వాయిస్ రికార్డ్ చేసిన దాని మీద చీఫ్ సెక్రటరికి ఫిర్యాదు చేసిన’ అని మంత్రి పొన్నం తెలిపారు.