Monday, May 5, 2025

నా చెప్పులే వారిద్దరికి సమాధానం

ఈ మధ్య సినిమావాళ్ళపై పొలిటికల్‌ నాయకులు సెటైర్‌లు వెయ్యడం… వాళ్ళను కామెంట్లు చేయడం చాలా కామన్‌ అయిపోయింది. కామన్‌ ఏంటి అదో ఫ్యాషన్‌లా భావిస్తున్నారు. ఎవరి ప్రొఫెషన్‌ వారిది. ఎవరి గొడవవారిది. దొరికితే దొంగ దొరక్కపోతే దొరలాగా వ్యవహరిస్తే ఎలా…ఇంతకీ ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా… బీజేపీ మహిళా నేత మౌనిక సుంకర సమంత, సాయి పల్లవిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అంతటా హాట్ టాపిక్‌గా మారాయి. పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడి తర్వాత ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డ సంగతి తెలిసిందే. అయితే ఇటువంటి సమయంలో సమంత షేర్ చేసిన ఓ పోస్ట్ సంచలనంగా మారింది. దేశంలో ఉన్న పాక్ పౌరులను స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో సింధు నదిలో ఇచ్చే వాటాలను సైతం నిలిపివేస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. అయితే సమంత దీన్ని ఉద్దేశించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌లో “సముద్రాలు.. నీళ్లు తాగలేవు, చెట్లు తమ పండించిన పండ్లు తినలేవు, సూర్యుడు తన కాంతిని చూడలేడు, పువ్వులు తమ పరిమళాన్ని ఆస్వాదించలేవు, ప్రకృ‌తి కోసం జీవించండి, మనమందరం కూడా ఒకరికి ఒకరు సాయం చేసుకోవడానికే భూమి మీద పుట్టాము, నీ కోసం జీవిస్తే, ఆనందంగా ఉంటావు, అందరి కోసం జీవిస్తే ఇంకా ఆనందంగా ఉంటావు” అనే అర్ధం వచ్చేలా సమంత పోస్ట్ చేసింది. సమంత షేర్ చేసిన పోస్ట్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే సమంత ఆ పోస్ట్‌ను డిలీట్ చేయడం జరిగింది. తాజాగా దీనిపై బీజేపీ మహిళా నేత మౌనిక సుంకర ఓ ఇంటర్య్వూలో స్పందించారు. మన దేశ తిండి తింటూ మన దేశ వనరులను ఎంజాయ్ చేసుకుంటూ కొంతమంది పాకిస్తాన్, చైనాకు అనుకూలంగా మాట్లాడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లకు ఒళ్లు ఉంటుందని ముద్దుగా మొహాలు ఉంటాయని కానీ మెదడు మాత్రం ఉండదని మౌనిక విమర్శలు గుప్పించారు. సమంత నీళ్లు నది తాగదని పండ్లు చెట్లు తినదని పాకిస్తాన్ కు నీళ్లు ఇవ్వాలని చెప్పిందని ఆమె చెప్పిన మాటకు ఏ కంపెనీ చెప్పు వాడాలని మౌనిక ప్రశ్నించారు. ఇదే సమయంలో సాయి పల్లవిపై సైతం ఆమె ఫైర్ అయ్యారు. మనం ఇచ్చిన డబ్బులతో ఆమె లావిష్ లైఫ్ ఎంజాయ్ చేస్తోందని మౌనిక అన్నారు. సాయిపల్లవి గోరక్ష చేసేవాళ్లను ఉగ్రవాదులని అంటుందని భారత్ ఆర్మీకి పాక్ ఏ విధంగా శత్రువో పాకిస్థాన్‌లో ఉన్నవాళ్లకు భారత్ శత్రువని సాయిపల్లవి గతంలో చెప్పిన మాటలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయి పల్లవిని ఆర్మీ దగ్గరకు పంపిస్తే ముక్కలు ముక్కలు చేస్తారంటూ మౌనిక వివాదాస్పద కామెంట్స్ చేశారు. “హైదరాబాద్ బీజేపీ కార్పొరేటర్‌పై కేసు నమోదు” సమంత, సాయిపల్లవి నన్ను కలిస్తే చెప్పులు వాడతానని ఆమె హాట్ కామెంట్స్ చేశారు. భారతదేశం నచ్చకపోతే నచ్చిన దేశాలకు వెళ్లిపోవాలని సమంత, సాయి పల్లవిలకు మౌనిక సుంకర సూచించారు. వీళ్లు ఒళ్లు చూపించుకుని డబ్బులు సంపాదించుకున్నారని, వీరు ఇన్ డైరెక్ట్ సాఫ్ట్ ప్రాస్టిట్యూట్స్ అని ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. మౌనిక సుంకర చేసిన ఆరోపణలు, విమర్శలు సినీ పరిశ్రమలోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. మౌనిక సుంకర చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. సమంత, సాయి పల్లవి అభిమానులు మౌనిక సుంకరపై విరుచుకుపడ్డారు. ఆమె వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని, నటీమణుల వ్యక్తిగత జీవితాల్లో తలదూర్చడం తగదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com