Sunday, October 6, 2024

అసలేంటి.. చంద్రబాబు-రేవంత్ ల మధ్య “నా గొడవ”?

ఏపీ సీఎం కు ఆ బహుమతి ఇవ్వడంలో రేవంత్ ఆంతర్యమేంటి?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యల పరిష్కారానికి ఓ అడుగు పడింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విభజన అంశాలపై హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఒకప్పుడు తమ అధినేత అయిన చంద్రబాబును ఘనంగా సత్కరించిన రేవంత్ రెడ్డి, ఆయనకు అరుదైన బహుమతి ఇచ్చారు. విభజన సమస్యలపై సమావేశం మొదలవ్వడానికి ముందే చంద్రబాబుకు ప్రజాకవి కాళోజీ నారాయణరావు రాసిన నా గొడవ పుస్తకాన్ని బహుకరించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం రేవంత్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందించి సత్కరించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. రేవంత్ రెడ్డి.. చంద్రబాబుకు నా గొడవ పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వడమే సర్వత్రా ఆసక్తిరేపుతోంది. నా గోడవ కవితా సంకలనాన్ని తెలంగాణకు చెందిన ప్రజాకవి కాళోజీ రాశారు. తెలంగాణ ఉద్యమం మొదలవ్వకముందే, తెలంగాణ ప్రజల కష్టాలు, నష్టాలపై పోరటం చేసిన గొప్ప వ్యక్తి కాళోజీ. ఆ రోజుల్లో నా గొడవ పేరుతో కాళోజీ రాసిన కవితా సంకలనం ప్రజల్లో ఉద్యమ స్పూర్తిని రగిల్చింది. అది కాస్త తెలంగాణ ఉద్యమానికి ప్రతిధ్వనిగా మారింది.

 

ప్రజా కవి కాళోజీ నా గొడవ కవితా సంకలనంలో సమకాలీన సమాజంలో జరుగుతున్న పరిణామాలను కళ్లకు కట్టినట్లు చెప్పారు. అందులో ప్రధానంగా.. అన్నాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి.. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి.. అన్యాయాన్ని ఎదిరించిన వాడు నాకు ఆరాధ్యుడు.. అంటూ చెప్పిన పంక్తులు అందరిలో ఆలోచన రేకెత్తించాయి. మరి అంతటి గొప్ప కవి కాళోజీ కవితా సంకలనం నా గోడవ పుస్తకాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇవ్వడంలో ఆంతర్యమేంటన్న చర్చ మొదలైంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular