నాగ చైతన్య నిశ్చితార్ధం తరువాత అక్కినేని కుటుంబలో మళ్ళీ సంబరాలు మొదలయ్యాయి. ఆగస్టు 8న నాగ చైతన్య, నటి శోభిత దూళిపాళతో ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. అక్కినేని నాగార్జున ఇంట్లో జరిగిన ఈ వేడుకకు చాలా కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అనంతరం నాగార్జున స్వయంగా తన ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలిపారు. నిశ్చితార్ధానికి సంబందించిన ఫోటోలను విడుదల చేశారు.
అయితే తాజాగా నాగ చైతన్య రెండో పెళ్లి, విడాకుల గురించి మాట్లాడారు నాగార్జున. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ.. సమంతతో విడాకుల తరువాత చైతన్య చాలా బాధపడ్డాడు. ఆ బాధను తనలోనే పెట్టుకున్నాడు. ఎవరితోనూ చెప్పుకోలేదు. కానీ, ఇప్పుడు చైతన్యని సంతోషంగా చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. పెళ్ళికి కాస్త సమయం ఉంది.. అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన తండేల్ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా.. కార్తికేయ ఫేమ్ దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ సంస్థ నుండి వస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఆకాశం ఉంది.