ఫిల్మ్ ఇండస్ట్రీలోకి “ఏ మాయ చేసావే” సినిమాతో ఎంట్రీ ఇచ్చింది కుందనపు బొమ్మ “సమంత”. మొదటి సినిమాలోనే తనదైన నటనతో మెప్పించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకోగలిగింది. టాలీవుడ్ లో అందరూ స్టార్ హీరోల సరసన నటించిన ఈ భామ.. ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ప్రొఫెషనల్ లైఫ్ కంటే కూడా పర్సనల్ లైఫ్ విషయాలతోనే సమంత నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చారు. ఆమె కారణంగానే విడాకులు జరిగాయి అంటూ పలు పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత ఆమె అనారోగ్యం కారణంగా సినిమాలకు కొంచెం గ్యాప్ ఇవ్వడం.. తెలుగులో సినిమాలు తగ్గించి బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఇక రీసెంట్ గానే నాగ చైతన్య మళ్లీ వివాహం చేసుకోగా.. సామ్ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడమోరుతో రిలేషన్ లో ఉన్నట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా ఓ మ్యాగజైన్ కి ఇచ్చిన ఫొటోషూట్ లో సామ్.. తన మెడ వెనుక భాగంలో ఉండే ఏమాయ చేసావే టాటూని తీసేసినట్టు కనిపించింది. ఆ సినిమానే సమంతకి మొదటి సినిమా అవ్వగా.. ఆ మూవీ నుంచే వారి ఆమధ్య ఫ్రెండ్ షిప్ మొదలై.. చివరకు ప్రేమ, పెళ్లి,విడాకుల వరకు వెళ్లారు. దాంతో నాగచైతన్యకు సంబంధించిన గుర్తులను అన్నింటినీ సమంత చెరిపివేసిందని అంటూ ఆ ఫోటోలను తెగ వైరల్ చేశారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వైరల్ గా అవుతున్న సమంత వీడియోని గమనిస్తే చైతన్యని ఆమె ఇంకా మర్చిపోలేదని తెలుస్తోంది. ఆ టాటూను తీసేయలేదని.. మేకప్ తో కవర్ చేసుకుందని మాట్లాడుకుంటున్నారు. జిమ్ వీడియో వైరల్.. ఇక నిన్ననే ముంబైలోని బాంద్రా ఏరియాలో ఉండే ఒక జిమ్ నుంచి బయటికి వచ్చిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో సామ్ తన కారు కోసం బయటికి రాగా.. నెటిజన్లు సమంత వెంటపడుతూ వీడియోలు, ఫోటోలు తీశారు. ఈ క్రమంలోనే సమంత వారిపై కాస్త అసహనం వ్యక్తం చేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట ఫుల్ గా చక్కర్లు కొడుతోంది. ప్రైవేట్ ఫొటోలు తీస్తావా..? బుద్ధి లేదా .. సమంత ఫైర్ వీడియో” అయితే ఆ వీడియో సరిగ్గా గమనిస్తే సమంత మెడ వెనక భాగంలో వైఎమ్సి టాటూ కనిపిస్తోంది. దీంతో సమంత నాగచైతన్యని ఇంకా మర్చిపోలేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అలానే సామ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.