Thursday, November 28, 2024

నాంపల్లి కోర్టులో నాగార్జున పరువు నష్టం కేసు

అడ్వకేట్‌ ‌ద్వారా రిప్లై దాఖలు చేసిన మంత్రి కొండా సురేఖ

మంత్రి కొండా సురేఖపై ప్రముఖ సినీనటుడు నాగార్జున వేసిన పరువునష్టం దావాపై నాంపల్లి స్పెషల్‌ ‌కోర్టులో విచారణ జరిగింది. మంత్రి కొండా సురేఖ తరఫున అడ్వకేట్‌ ‌గుర్మీత్‌ ‌సింగ్‌ ‌రిప్లై ఫైల్‌ ‌చేశారు. తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబర్‌ 30‌కి వాయిదా వేసింది. సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబాన్ని, వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ ఇటీవల మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేశారు.

తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్ఠ దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు.  నాగార్జున కేసుతో మంత్రి కొండా సురేఖకు నాంపల్లి స్పెషల్‌ ‌కోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. హీరో నాగార్జున వేసిన క్రిమినల్‌, ‌పరువునష్టం దావా కేసులో వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అక్కినేని నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆర్‌ ‌కారణమంటూ కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై నాగార్జున కోర్టును ఆశ్రయించారు.

ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. ఓపెన్‌ ‌కోర్టులో నాగార్జున సహా సాక్షులుగా ఉన్న యార్లగడ్డ సుప్రియ, మెట్ల వెంకటేశ్వర్లువాంగ్మూలాన్ని న్యాయమూర్తి ఇప్పటికే రికార్డు చేశారు. నాగార్జున అందించిన ఆధారాలను పరిగణలోకి తీసుకున్నారు. నాగార్జునపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇవ్వాలని కొండాకు జారీ చేసిన నోటీసుల్లో కోర్టు పేర్కొంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular