-పేరు పెట్టుకుంటే సరిపోదు ట్యాలెంట్ కూడా చూపాలి
ఎప్పటి నుంచో నందమూరి కుటుంబంలో విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, బాలకృష్ణల మధ్య మనస్పర్థలు ఇప్పుడు కొత్తేమి కాదు. ముఖ్యంగా హరికృష్ణ మరణం తర్వాత , నందమూరి కుటుంబంలో ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఒంటరయ్యారు. ఇదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు అరెస్ట్‌పై నందమూరి కుటుంబం అంతా స్పందించినప్పటికీ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు మాత్రం ఈ ఘటనపై రియాక్ట్ కాలేదు. అప్పటి నుంచి నారా, నందమూరి కుటుంబం ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లను దూరం పెడుతూ వస్తోంది. ఇటీవల నందమూరి కుటుంబం నుంచి ఎన్టీఆర్‌ను దూరం చేసే కార్యక్రమం ఒకటి జరిగింది. ఇటీవలే బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంపై సినీ ,రాజకీయ ప్రముఖులందరూ స్పందించారు. దీనిపై ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు సైతం రియాక్ట్ అయ్యారు. ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డుతో సత్కరించబడిన బాల బాబాయ్‌కి హృదయపూర్వక అభినందనలు. ఈ గుర్తింపు మీరు సినిమాకు చేసిన అసమానమైన కృషికి, మీ అవిశ్రాంత ప్రజా సేవకు నిదర్శనం అంటూ ఎన్టీఆర్ ట్వీట్టర్ వేదికగా స్పందించారు. దీంతో నందమూరి కుటుంబంలో విభేదాలు తొలగిపోయినట్టే అభిమానులు భావించారు. కానీ నందమూరి కుటుంబంలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు రావడంతో నందమూరి, నారా కుటుంబాలు కలిసి స్పెషల్ పేపర్ యాడ్ ఇచ్చారు. ఈ యాడ్‌లో ఈ రెండు ఫ్యామిలీలకు చెందిన అందరి పేర్లు కనిపించాయి. కానీ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పేర్లు మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఆ తర్వాత దీనికి సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్యామిలీ పార్టీలో కూడా ఎక్కడా ఎన్టీఆర్ కనిపించలేదు. దీంతో ఆయనకు ఆహ్వానం అందలేదని అర్థం అయింది. తాజాగా మరోసారి ఎన్టీఆర్ పేరుపై నందమూరి ఫ్యామిలీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు జానకి రామ్ కుమారుడు తారక రామారావు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. వై. వి. ఎస్. చౌదరి దర్శకత్వంలో తన మొదటి చిత్రంలో నటించబోతున్నాడు తారక రామారావు. ఈ సందర్భంగా నందమూరి ఫ్యామిలీ మొత్తం కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నందమూరి మోహనకృష్ణ మాట్లాడుతూ..జానకి రామ్ కుమారుడు తారక రామారావు అమెరికాలో పుట్టారని,అప్పుడే అతనికి ఈ పేరు పెట్టడం జరిగిందని ఆయన తెలిపారు. పుట్టుకతోనే అతనికి తారక రామారావు పెట్టామని, అంతేగాని ఇప్పుడు కొత్తగా పెట్టింది కాదంటూ ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆ పేరుపై ఆయన అంత క్లారిటీ ఎందుకు ఇచ్చారో ఎవరికి అర్థం కాలేదు. హరికృష్ణ ఓ సమయంలో మాట్లాడుతూ.. తన మూడో కుమారుడుకు మా నాన్న తన పేరునే కావాలని పెట్టారని వెల్లడించారు. అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ పేరు వాడుకలోకి వచ్చింది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరును ఉద్దేశించే నందమూరి ఫ్యామిలీ ఇలా మాట్లాడి ఉంటారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అసలు పేరు గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్ నడించింది. సరిగ్గా ఇదే సమయంలో ఎన్టీఆర్ పేరు గురించి నందమూరి ఫ్యామిలీ మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇకపోతే దీనిపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా పేరు పెట్టుకుంటే సరిపోదు ఆ పేరులో ఉన్న ట్యాలెంట్‌ని నిలబెట్టాలి అంటూ తిరిగి ఎదురు కౌంటర్ ఇచ్చారు.