Monday, May 12, 2025

నమ్మినోళ్ళందరూ మోసంచేశారు… ఎవరెవరంటే?

సినిమా సెట్స్‌లో ఎన్నో జరుగుతుంటాయి. వాటిలో ఇది కూడా ఒకటి ఓ స్టార్‌ డైరెక్టర్‌ ఉన్న సెట్‌లో ఒక లేడీ ఆర్టిస్ట్‌కి అవమానం జరగడం అనేది చాలా విచారకరం. ఈ విషయాన్ని ఒకప్పటి దర్శకుడు గీతా కృష్ణ వెల్లడించారు. ఇటీవలె ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నారు. సిల్క్ స్మిత జీవితం ఒక విషాదాంతం. నిరుపేద స్థితి నుంచి, పూట గడవని పరిస్థితి నుంచి తనే సొంతంగా కష్టపడుతూ, చిన్నా చితకా పనులు చేసుకుంటూ, ఇంట్లో పనిమనిషిగానూ పనిచేసి ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి నటిగా ఎదిగింది. వ్యాంప్‌ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఐటెమ్స్ సాంగ్స్ తో స్టార్‌గా ఎదిగింది. పాటలకే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్‌గానూ నిలవడం విశేషం. స్టార్‌ హీరోయిన్ల సినిమా పారితోషికం కంటే సిల్క్ స్మిత ఒక పాట పారితోషికం ఎక్కువగా ఉండటం మరో విశేషం.

ఎన్నో అవమానాలు, చాలా ఇబ్బందులు నడుమ తనని ఛీదరించుకున్న రోజుల నుంచి తను లేకపోతే సినిమా లేదు అనే స్థాయికి ఎదిగింది. అంతగా హవా చూపించింది. డబ్బుల కోసం కష్టాలు పడి ఆ తర్వాత అదే నోట్ల కట్టలపై పడుకున్న సందర్భాలున్నాయి. జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను చూసి, కొన్ని పొరపాట్లు, మోసాలతో ఆమె జీవితం విషాదంగా ముగిసేలా చేశాయి. అప్పట్లో ఆమె అంటే గౌరవం ఉండేది కాదని, అంత దారుణంగా అవమానించారని తెలిపారు. అలాంటిది ఆమెనే ఆ తర్వాత స్టార్‌ డైరెక్టర్లు, స్టార్‌ హీరోలు కూడా వెయిట్‌ చేసే స్థాయికి ఎదగడం విశేషం. ఇదిలా ఉంటే సిల్క్ స్మితని ఒక ఆర్‌ఎంపీ డాక్టర్‌ మోసం చేశారని అంటుంటారు. ఆయనే సిల్క్ స్మితకి అండగా ఉన్నాడట, చివరికి తనే మోసం చేశాడట. కానీ అంతకు ముందు ఓ డైరెక్టర్‌ ఆమెని బాగానే వాడుకున్నాడట. అంతేకాదు ఆమెకి లైఫ్‌ ఇచ్చాడట. ఆయనే బాలు మహేంద్ర. ఆయన దర్శకుడే కాదు సినిమాటోగ్రాఫర్‌ కూడా.

సిల్క్ స్మితని తన సినిమాల్లో బాగా చూపించేవారట. అలా ఆమె పాపులర్‌ అయ్యేలా చేశాడు. ఈ క్రమంలో సిల్క్ స్మితని అన్ని రకాలుగా బాగానే ఉపయోగించుకున్నారట. కానీ ఆ తర్వాత ఆమెని పట్టించుకోలేదు. అయితే కెరీర్‌ బిగినింగ్‌లో ఓ సినిమా సెట్‌లో ఏకంగా ఆమెని ఒంటరి చేసి సెట్‌లోనే వదిలేసి వచ్చారట. అప్పట్లో స్టార్‌ డైరెక్టర్‌గా ఉన్న భారతీరాజా `సీతాకోక చిలుక` అనే సినిమాని రూపొందించారు. దీనికి ఏడిద నాగేశ్వరరావు నిర్మాత. ఈ మూవీలో సిల్క్ స్మిత చిన్న రోల్‌ చేసింది. ఇలా ఓ స్టార్‌ డైరెక్టర్‌ సెట్‌లో ఓ లేడీ ఆర్టిస్ట్‌కి దక్కిన గౌరవం అని చెప్పవచ్చు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com