Saturday, February 22, 2025

నాంపల్లిలో లిఫ్టులో ఇరుక్కున్న బాలుడు మృతి

నాంపల్లిలో లిఫ్టులో ఇరుక్కున్న బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. శుక్రవారం సాయంత్రం నాంపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌ లిఫ్టులో చిక్కుకున్న బాలుడ్ని రక్షించిన సిబ్బంది నిలోఫర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. బాలుడి ప్రాణాలు నిలిపేందుకు డాక్టర్లు సర్జరీ చేశారు. ఈ క్రమంలో శనివారం నాడు బాలుడు అర్నవ్ చనిపోయాడని అధికారులు తెలిపారు. శాంతినగర్‌లోని హాకీ గ్రౌండ్ సమీపంలోని మఫర్ అపార్ట్‌మెంట్ లిఫ్టులో అర్ణవ్ అనే 5 ఏళ్ల బాలుడు శుక్రవారం ఇరుక్కున్నాడు. నాలుగో అంత‌స్తులో ఉండ‌గా బాలుడు ప్రమాదవశాత్తూ లిఫ్టులో చిక్కుకున్నాడు. పోలీసులు, రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని తీవ్రంగా శ్రమించి బాలుడ్ని కాపాడారు. సీపీఆర్ చేసిన అనంతరం అర్నవ్‌ను 108లో నీలోఫర్ ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు సర్జరీ చేశారు. కానీ పరిస్థితి విషమించడంతో బాలుడు చనిపోయాడు.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com