-
బాలకృష్ణకు బెయిల్ వచ్చింది
-
ఆక్రమాస్తుల కేసులో ఆరెస్ట్ అయిన రెరా మాజీ సెక్రెటరీ
టీఎస్, న్యూస్:రెరా మాజీ కార్యదర్శి శివ బాలకృష్ణకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జనవరి 25న శివ బాలకృష్ణ అరెస్టయిన విషయం తెలిసిందే. నిర్ణీత 60 రోజుల్లో ఛార్జిషీట్ వేయకపోవడంతో శివబాలకృష్ణకు కోర్టు బెయిల్ ఇచ్చింది. రూ.లక్ష, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. అయితే, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని శివబాలకృష్ణకు ఆదేశించింది. ఆయన సోదరుడు శివ నవీన్‌కు సైతం బెయిల్‌ను ఇచ్చింది.
ఇంతకు ముందు శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు కొట్టివేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివ బాలకృష్ణ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆయన వద్ద రూ.250 కోట్ల విలువైన ఆస్తులను ఏసీబీ గుర్తించింది. శివ బాలకృష్ణ పేరిట బినామీల పేరుతో 214 ఎకరాల భూమి, ఏడు ఇండ్లు, ఒక విల్లా ఉన్నట్టు ఏసీబీ అధికారులు విచారణలో గుర్తించారు. వీటితో పాటు కుటుంబసభ్యుల పేరుతో 29 ప్లాట్లు ఉన్నట్లు తేల్చారు. 19 ఓపెన్ ప్లాట్లు, 7 ఫ్లాట్లు, 3 విల్లాలు బంధువుల పేరుతో ఉన్నట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడింది. ఇప్పటివరకు బయటపడిన ఆస్తులు రూ.250 కోట్ల విలువ చేస్తాయని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.