Saturday, September 21, 2024

బాలయ్య కొత్త చిత్రం అప్‌డేట్‌

నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సూపర్‌ హిట్స్ ను దక్కించుకుంటున్న విషయం తెలిసిందే. వరుస హిట్స్ తో హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నారు. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్‌ అంతా చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు. బాబీ గత చిత్రం వాల్తేరు వీరయ్య భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అందుకే బాలయ్య 109 సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అంచనాలకు తగ్గట్లుగా బాబీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని బాలయ్య సినిమాను రూపొందిస్తున్నాడు. బాలకృష్ణ మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెల్సిందే.

ఆ ఎన్నికల ముందే షూటింగ్‌ పూర్తి చేయాలని భావించినా కూడా రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల బాలయ్య డేట్లు ఇవ్వలేదు. ఎన్నికలు పూర్తి అయిన వెంటనే బాలకృష్ణ షూటింగ్ లో పాల్గొంటాడని అంతా భావించినా అది సాధ్యం కాలేదు. అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే సినిమా ను ఈ దసరాకు విడుదల చేయాల్సి ఉంది. కానీ షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. 2025 సంక్రాంతికి బాలకృష్ణ 109వ సినిమా రాబోతుంది. చిరంజీవి విశ్వంభర తో పాటు పలు సినిమాలు సంక్రాంతికి ఫిక్స్ అయ్యాయి. అయితే అందులో రవితేజ సినిమా వచ్చే పరిస్థితి లేదు. షూటింగ్‌ పూర్తి కాక పోవడంతో పాటు, ఇటీవల రవితేజ కు యాక్సిడెంట్‌ అయింది. ఆయన కోలుకుని షూటింగ్‌ కు హాజరు అవ్వడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుంది.

2023 సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. 2025 సంక్రాంతికి మరోసారి చిరంజీవి, బాలయ్య లు పోటీ పడబోతున్నారు. వీరితో పాటు వెంకటేష్ కూడా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ముగ్గురు హీరోల సినిమాలు సంక్రాంతికి రెడీ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular