కృష్ణాజిల్లా:- గన్నవరం
గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ప్రముఖ సినీ నటుడు హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
బాలకృష్ణ మాట్లాడుతూ :కనీ విని ఎరుగని రీతిలో ఇటువంటి విపత్తు రావడం చాలా బాధాకరం.ఇటువంటి సమయంలో నిరాశ్రయులు అయినవారికి ప్రతి ఒక్కరు అండగా ఉండాలి.కళాకారులు వారి వారి షూటింగ్ పనుల్లో బిజీగా ఉంటారు.సమయం దొరికింది కాబట్టి వచ్చి మేము ప్రకటించిన సహాయాన్ని ప్రభుత్వానికి మేము అందజేస్తాం.గతంలో దివిసీమలో ఉప్పెన వచ్చిన సందర్భాల్లో కూడా నాన్నగారు జోలి పట్టి మరి అడిగి సహాయం చేసినటువంటి మహనీయులు.వాళ్ల పేర్లు చెప్పడం కూడా అనవసరం అంటూ జగన్మోహన్ రెడ్డిని ఎద్దేవా చేసిన బాలకృష్ణ.ఇటువంటి విపత్తు ప్రభుత్వ సృష్టించింది అని వారు మాట్లాడటం చాలా హాస్యాస్పదం.