Friday, April 4, 2025

రైలు ఆలస్యం…ఓటుహక్కును కోల్పోయిన ఓటర్లు

  • నాందేడ్ టు విశాఖపట్నం వెళ్లాల్సిన రైలు
  • 9 గంటలు ఆలస్యం
  • రైల్వే శాఖకు, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన ప్రయాణికులు

రైలు ఆలస్యం కారణంగా ప్రయాణికులు తమ ఓటు హక్కును కోల్పోయారు. ఎంతో ఆశతో ముందుగా రిజర్వేషన్ చేసుకున్నా 9 గంటలు ఆలస్యంగా గమ్యానికి చేరుకోవడంతో సుమారుగా 5 వేల మందికి పైగా ప్రయాణికులు ఓటు వేయలేక పోయామని ఓటర్లు రైల్వే శాఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాందేడ్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రయాణికులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం రెండు నెలల ముందుగానే టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే నాందేడ్ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన రైలు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు మే 12వ తేదీ రాత్రి 9.30 గంటలకు రావాల్సి ఉంది.

అయితే 5 నుంచి -6 గంటలు ఆలస్యంగా రావడంతో 13 తేదీ తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్‌కు చేరుకుంది. దీంతో మధ్యాహ్నం 3 లేదా 4 గంటలకు ఎపికి చేరుకొని ఓటు వేస్తామని ప్రయాణికులంతా భావించినా విశాఖకు అనుకున్న సమయానికి కంటే 9 గంటల ఆలస్యంగా చేరుకోవడంతో ఓటింగ్ సమయం అయిపోయిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రైలులో ఎక్కువగా తాడేపల్లి, రాజమండ్రి, విశాఖపట్నం వరకు వెళ్లే ప్రయాణికులు ఉన్నారు. కేవలం రైలు ఆలస్యం కారణంగానే తమ ఓటు హక్కును వినియోగించుకోలేక పోయామని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మధ్యాహ్నం 2 గంటలైనా రాజమండ్రికి రాని రైలు….
మామూలుగా అయితే నాందేడ్ నుంచి విశాఖ వెళ్లాల్సిన ఎక్స్‌ప్రెస్ 13 వతేదీ ఉదయం 9 గంటలకు విశాఖపట్నం చేరుకోవాలి. మధ్యాహ్నం 2 గంటలు అయినప్పటికీ రాజమండ్రి కూడా చేరుకోలేదని ప్రయాణికులు వాపోయారు. రాజమండ్రి నుంచి విశాఖపట్నం చేరుకోవాలంటే కూడా 3 నుంచి 4 గంటలు పడుతుంది. దీంతో 5 ఏళ్లకు ఒకసారి వచ్చే తమ ఓటు హక్కును కోల్పోయామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై రైల్వే అధికారులకు, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని, ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వారు వాపోయారు. తమ ప్రమేయం లేకుండా జరిగిన ఈ అసౌకర్యానికి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com