Tuesday, April 29, 2025

నాని అంటే అందుకే నాకు ఇష్టం- శైలేష్‌ కొలను

నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా, శైలేష్‌ కొలను దర్శకత్వంలో రూపొందిన మూవీ హిట్‌ 3. ఈ సినిమా ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంది. థియేటర్లలో మే 1న మూవీ విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శైలేష్‌ కొలను మాట్లాడారు. హిట్3 షూటింగ్ విశేషాలను పంచుకున్నారు. హిట్‌3 మొత్తం 7 పార్ట్‌ అనుకున్నాం. కానీ ప్రేక్షకుల ఆదరణ బట్టి మిగతా పార్ట్స్‌ ఉంటాయి. నాని అంటే నాకు చాలా ఇష్టం. సినిమా మీద ఆయనకున్న పాషన్ అద్భుతం. ఈ సినిమా షూటింగ్ లో ఫైర్ నాని హెయిర్ కి అంటుకుంది. వెంటనే యూనిట్ వెళ్లి ఆపింది. ఇంకా షూటింగ్ ఉండదనుకున్నాను. ఆయన నెక్స్ట్ షాట్ కి రెడీ అయిపోయారు. అదే రోజు షూటింగ్‌లో ఆయన తలకి గాయం అయింది. బ్లడ్ క్లాట్ అయిన తర్వాత మిగిలిన సీన్స్ అన్ని ఫినిష్ చేసి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ షూటింగ్ కి వచ్చేసారు. సినిమా మీద ఆయనకున్న మ్యాడ్ పేషన్ వండర్ ఫుల్. నాని పక్కన ఉంటే చాలా ఇన్స్‌పైరింగ్ గా ఉంటుంది. నన్ను ఇంత బలంగా నమ్మిన నానికి థాంక్యూ. మే ఒకటి నా సినిమా రిలీజ్ అవుతుంది. ఇది చాలా హానెస్ట్ ఫిలిం. వైలెంట్ గా ఉంటుంది. సినిమాని థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి’అన్నారు.

 

 

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com