సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబంతో వి.కె. నరేష్ ఎంత కలవాలనుకుంటున్నప్పటికీ అటువైపు నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్ రావడం లేదు. నరేష్ వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న గొడవల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్.. ఇప్పుడు నటి పవిత్రా లోకేష్‌తో ప్రేమ వ్యవహారం వివాదంగా మారింది. మహేష్‌బాబుతో సహా కృష్ణ కుటుంబం మొత్తం నరేష్‌ను దూరం పెట్టింది. అంతేకాకుండా కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు. ఓ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆదిశేషగిరిరావు సీనియర్ నటుడు నరేష్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. నరేష్ ఎవరో తనకు తెలీదని అన్నారు. ఆయన గొడవల గురించి తాను మాట్లాడానని.. తనకు ఇష్టం లేదని తేల్చి చెప్పారు.
ఈ నేపథ్యంలోనే నరేష్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ కుటుంబ సభ్యులకు దగ్గరయ్యే వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది రెండు పెద్ద కార్యక్రమాలు తీసుకున్నానని, సినిమా మ్యుజియం అండ్ లైబ్రేరీ అండ్ క్రియేటివ్ స్పేస్ ఫర్ యంగ్ పీపుల్ ఏర్పాటు చేసి, దీనికి ఘట్టమనేని ఇందిరా దేవి పేరుతో ప్రారంభించాం అన్నారు. అందులో విజయ కృష్ణ మందిరం కూడా ఏర్పాటు చేశామని, తాను పవిత్ర, దీనిని ఒక మిషన్ లా తీసుకొని కళాకారుల ఐక్యవేదిక సంస్థ పేరుపైన ఈ కార్యక్రమాన్ని ప్రాంభించామన్నారు. ఆల్రెడీ ఒక బిల్డింగ్ తయారౌతోందని, దీని లైఫ్ టైం వర్క్.. దినికి సంబధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అని నరేష్ ప్రకటించారు.
నరేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకాలం దూరంగా ఉంటున్న ఈ ఇరు కుటుంబాల మధ్య నరేష్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.ఇక ఈ విషయాన్ని కృష్ణ కుటుంబం ఏవిధంగా తీసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది.