టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అరెస్టయితే పార్టీ పగ్గాలు ఆయన సతీమణి నారా బ్రాహ్మణి చేతుల్లోకి వెళ్లనున్నాయి. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ (టిడిపి) పోలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు గురువారం వెల్లడించారు.చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టిడిపి ఎంవీపి కాలనీలో కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. న్యూఢిల్లీ నుంచి రాజమండ్రికి రాగానే నారా లోకేష్ ను అరెస్టు చేస్తారనే సమాచారం ఉందన్నారు. ఈ విషయంపై ఢిల్లీలోనూ విజయవాడలోనూ పార్టీ నాయకులు చర్చించినట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు జైలులో ఉన్నారని, లోకేష్ జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని, టిడిపిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, అది సాధ్యం కాదన్నారు. తెలుగుదేశం పార్టీలో నాయకులకు కొరత లేదని, అవసరమైన నారా బ్రాహ్మణి పార్టీకి నాయకత్వం వహిస్తారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర గత తెలుగుదేశం ప్రభుత్వం రోడ్లు వేసిందని, రక్షణ కోసం రెండు అంబులెన్సులను పెట్టిందని ఆయన గుర్తు చేశారు.