Saturday, October 5, 2024

వ్యవసాయానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వకుండా ఏఈ ఇబ్బందిపెడుతున్నారు

డీఎస్సీ, కానిస్టేబుల్ అభ్యర్థుల శిక్షణకు స్టడీ సెంటర్ ఏర్పాటుచేయండి.డబుల్ రిజిస్ట్రేషన్ తో స్థలాన్ని కబ్జా చేశారు

40వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ లో ప్రజల విన్నపాలు సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ అమరావతిః రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి, వారికి అన్ని విధాల అండగా నిలుస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ 40వ రోజు ప్రజాదర్బార్ కు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. మంత్రిని స్వయంగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి.. ఆయా సమస్యల త్వరితగతిన పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు.

మంగళగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన విజ్ఞప్తులు

వికలాంగ పెన్షన్ మంజూరుచేసి ఆదుకోండి

– పదో తరగతి వరకు చదువుకున్న తమ కుమారుడికి ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించి ఆదుకోవాలని తాడేపల్లికి చెందిన సీహెచ్ ఆరోగ్యరావు విజ్ఞప్తి చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తాము కుమారుడి సంపాదనపైనే ఆధారపడి జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పనులకు వెళ్తున్న తమ కుమారుడికి ఉద్యోగం కల్పించాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

– అనారోగ్యంతో బాధపడుతున్న తనకు ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని తాడేపల్లి బ్రహ్మానందపురానికి చెందిన సీహెచ్ ఆగ్నేసు కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

– భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న తాను ఇటీవల ఓ భవన నిర్మాణం సమయంలో ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డానని, వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని నూతక్కికి చెందిన వి.కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. జీవనోపాధి అవకాశం కల్పించడంతో పాటు పిల్లలకు చదువులకు కూడా సాయం అందించాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

– రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తనకు శరీరంలోని ఎడమభాగం పూర్తిగా పనిచేయడం లేదని, వికలాంగ పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరి 14వ వార్డుకు చెందిన బిట్రు హేమ కిషన్ విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తులు

డీఎస్సీ, కానిస్టేబుల్ అభ్యర్థుల శిక్షణకు స్టడీ సెంటర్ ఏర్పాటుచేయండి

– గత వైసీపీ ప్రభుత్వ అండతో డబుల్ రిజిస్ట్రేషన్ చేసి తాము కొనుగోలు చేసిన స్థలాన్ని కబ్జా చేశారని కృష్ణా జిల్లా బట్లపెనుమర్రుకు చెందిన సంగిశెట్టి వెంకట సీతారావమ్మ, మాచర్ల విజయలక్ష్మి, మునగాల మాధవి మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. 1995లో వెల్లంకి లక్ష్మీనారాయణ వద్ద తాము స్థలాన్ని కొనుగోలు చేశామని, అయితే సదరు స్థలాన్ని లక్ష్మీనారాయణ వేరొకరికి రిజిస్ట్రేషన్ చేసి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విచారించి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

– గతేడాది విజయవాడ బస్ స్టేషన్ లో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్లాట్ ఫామ్ పై ఉన్న ప్రయాణికులపై బస్సు దూసుకొచ్చిన ఘటనలో తన ఆరు నెలల కుమారుడు మరణించాడని, ఆ మనోవేదనతో ఉద్యోగం కోల్పోయానని బాపట్ల జిల్లా పంగులూరుకు చెందిన కాటి యల్లమంద మంత్రి నారా లోకేష్ ను కలిసి కన్నీటిపర్యంతమయ్యారు. కుటుంబ జీవనం కోసం ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

– డీఎస్సీ, ఎస్ఐ, కానిస్టేబుల్ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులకు శిక్షణ కోసం స్టడీ సెంటర్ ఏర్పాటుచేయాలని రంపచోడవరానికి చెందిన డాక్టర్ పల్లాల రాజ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

– వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వకుండా అసిస్టెంట్ ఇంజనీర్ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఏలూరు జిల్లా పెదవేగికి చెందిన రాజబోయిన సీతమ్మ మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో అన్ని డాక్యుమెంట్లతో విద్యుత్ సరఫరా కోసం దరఖాస్తు చేశాను. రూ.44 వేలు చెల్లించి డీడీ కూడా సమర్పించాను. అయితే పెదవేగి అసిస్టెంట్ ఇంజనీర్.. విద్యుత్ స్థంబాల ఏర్పాటు, విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంలో తాత్సారం చేస్తున్నారు. పలుమార్లు విన్నవించిన ఫలితం లేదు. విచారించి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. పరిశీలించి తగిన ఆదేశాలు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

– వారసత్వంగా సంక్రమించిన తమ భూమిని నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేశారని సత్యసాయి జిల్లా నామాల గ్రామానికి చెందిన బుక్కపట్నం రమణమ్మ మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. తమవద్ద అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయని.. బి.ఆదినారాయణ అనే వ్యక్తి పాస్ పుస్తకాలు సృష్టించి తమ భూమిని అన్యాక్రాంతం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విచారించి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular