సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణ శ్రీ గణేష్ పేరును కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా అనౌన్స్ చేసింది. ఈ మేరకు శనివారం ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కే.సీ వేణుగోపాల్ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. గణేష్ ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. కంటోన్మెంట్ అభ్యర్థిపై అనేక చర్చల అనంతరం చివరకు గణేష్ పేరునే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది.