ఈటీవి హైదరాబాద్ బ్యూరో చీఫ్ నారాయణ మృతి చాలా బాధాకరం అని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం నాడు మహాప్రస్థానం లో నిర్వహించిన అంత్యక్రియలకు హాజరైన తలసాని శ్రీనివాస్ యాదవ్ నారాయణ పార్ధీవ దేహానికి నివాళులు అర్పించి సంతాపం తెలిపారు. నారాయణ తో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. నారాయణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్ధించారు.