అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ విజయం దిశగా దూసుకెలుతున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ప్రధాని నరేంద్రమోడీ ఫోన్ చేశారు. ఏపీలో కూటమి విజయం దిశగా వెలుతుండడం పట్ల అభినందనలు తెలిపారు. కూటమి అభ్యర్ధులంతా భారీ ఓట్లతో విజయం సాధిస్తుండడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.