జూ. ఎన్టీఆర్ మామకు హైడ్రా షాక్
జూబ్లీహిల్స్‌లోని రూ.3,900 కోట్ల ప్రభుత్వ భూమిని బాలుడి లేఖ ద్వారా హైడ్రా కబ్జా కాకుండా కాపాడిది. హైదరాబాద్ లో హైడ్రా నిర్వహించిన ఆపరేషన్‌లో లంగర్ హౌజ్‌కు చెందిన ఒక బాలుడు విజిల్ బ్లోయర్‌గా మారాడు. ఆ బాలుడు రాసిన లేఖ వల్ల జూబ్లీహిల్స్‌లోని 39 ఎకరాల ప్రధాన ప్రభుత్వ భూమిని తిరిగి పొందేందుకు కారణం అయింది. దీని విలువ రూ.3,900 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. హైడ్రాకు లేఖ రాసిన బాలుడు జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్ సమీపంలోని బహిరంగ స్థలంలో క్రికెట్ ఆడుతూ ఉంటాడు. అయితే అకస్మాత్తుగా అక్కడ కంచెలు వేసేశారు. నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆ బాలుడు హైడ్రాకు లేఖ రాశాడు. హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ ఆ భూమి రికార్డులను పరిశీలించారు. ఆ భూమి రాష్ట్ర ప్రభుత్వానికి చెందినదని, ప్రస్తుతం చట్టపరమైన వివాదంలో ఉందని గుర్తించారు. ఆ స్థలాన్ని పరిశీలించి, భూమిని విక్రయించడానికి, అభివృద్ధి చేయడానికి జరిగిన ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుసుకుని శనివారం కూల్చి వేసింది.
ఈ సందర్భంగా నిషేధ జాబితాలో ఉన్న భూమిని నార్నే ఎస్టేట్స్ నిశ్శబ్దంగా అమ్మేస్తోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. చట్టపరమైన వివాదం సమయంలో ఏదైనా అభివృద్ధి లేదా అమ్మకం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన జోన్‌లలో ఒకటైన 39 ఎకరాల విస్తీర్ణంలో, ఎకరానికి రూ. 100 కోట్లకు పైగా మార్కెట్ రేటును ఉంటుంది. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సంబంధించి వివిధ కోర్టులలో కేసులున్నప్పటికీ చుట్టూ ప్రహరీ నిర్మించి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆక్రమణలకు పాల్పడుతున్నారు.
అక్కడ బోర్డులు ఉన్నా సరే అమ్మేస్తున్న నార్నే గ్రూపు
ల్యాండ్ గ్రాబింగ్ కేసున్నట్టు అక్కడ బోర్డులుంటుండగానే.. మరోవైపు అక్కడ ప్లాట్ల కొనుగోలుకు సంప్రదించాల్సిన ఫోను నంబర్లతో బోర్డులు ఏర్పాటు చేసింది నార్నే ఎస్టేట్స్ సంస్థ. అనుమతిలేని లే ఔట్‌తో రహదారులు నిర్మిస్తూ.. ప్లాట్లు అమ్మకాలు చేపట్టిన ఆక్రమణదారులు రెచ్చిపోయారు. హాఫీజ్‌పేట్, రాయదుర్గం ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించి ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ బోర్డు లు పెట్టారు హైడ్రా అధికారులు. ఆక్రమించుకున్న వారిపై కేసులు పెట్టారు. నార్నె ఎస్టేట్స్ కు యజమాని నార్నే శ్రీనివాసరావు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ సతీమణి ప్రణతీ తండ్రి. ఆయనకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థనే భూముల్ని కబ్జా చేసినట్లుగా హైడ్రా చెబుతోంది. రాయదుర్గం ఎరియాలో నార్నే పేరుతో ఓ రోడ్ ఉంటుంది. ఆ ఏరియాలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేసారు. అయితే ఇప్పుడు ఆ భూములు కబ్జాలని హైడ్రా చెబుతోంది. ఈ కూల్చివేతలపై నార్నే గ్రూపు నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు.