Saturday, May 10, 2025

నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు ప్రజాప్రతినిధుల విరాళం సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

పాకిస్తాన్ దుస్సాహస చర్యలపై విరుచుకుపడుతున్న భారత సైనికులకు ప్రతి వ్యక్తి అండగా నిలవాలని రాష్ట్రం ప్రభుత్వం పిలుపునిచ్చింది. పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైనికుల దాడి నేపథ్యంలో నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఒక నెల వేతనం విరాళంగా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో సీఎం చర్చించారు. సీఎం సూచన మేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో చర్చించి ఒక నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించనున్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

సీఎం బెంగళూరు పర్యటన రద్దు :
సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరు పర్యటన రద్దు అయింది. బెంగళూరులోని ఓ కాంక్లేవ్‌ కార్యక్రమానికి శుక్రవారం హాజరుకావల్సిన ఆయన భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అకస్మాత్తుగా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. మరోవైపు ప్రయాణికులకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ను ఆదేశించింది. ఇక ప్రతి ఎయిర్‌పోర్టులోనూ ప్రయాణికులతో సెకండరీ లాడర్ పాయింట్ చెక్ చేయించుకోనున్నారు. అదేవిధంగా టెర్మినల్ భవనాల్లో సందర్శనకు వచ్చే విజిటర్స్‌పై నిషేధం విధించారు. దేశ వ్యాప్తంగా ప్రయాణికులు చెక్‌-ఇన్, బోర్డింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. షెడ్యూల్ చేయబడిన ఫ్లైట్లు బయలుదేరే సమయానికి కనీసం మూడు గంటల ముందే ఎయిర్‌పోర్టులకు చేరుకోవాలని.. 75 నిమిషాల ముందే వారి చెక్-ఇన్ ముగుస్తుందని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఆర్డర్‌లో ప్రస్తావించారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com