Wednesday, May 7, 2025

వాహనంపై జాతీయ జెండా ఎగరవేసే హక్కు అందరికీ ఉందా? 

నిబంధనలు ఏం చెబుతున్నాయి..ఈ తప్పులు చేస్తే 3 ఏళ్ల జైలు

భారత్ స్వాతంత్య దినోత్సవ వేడుకలకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య దినోత్సన వేడుకలు జరుపుకునేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఈ సందర్బంగా ఆగస్టు 15 కు ముందు ప్రతి ఇంటికి త్రివర్ణ పతాకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఐతే ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమంలో త్రివర్ణ పతాకంతో తమ సెల్ఫీని ‘harghartiranga.com’ లో అప్‌ లోడ్ చేయాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ.

 

ఐతే జాతీయ జెండా ఎగర వేయడంలో కొన్ని స్పష్టమైన నియమ నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే శిక్ష విధించే అవకాశం ఉంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రజలు తరచుగా తమ బైక్ లేదా కారుపై త్రివర్ణ పతాకాన్ని ఉంచుతారు. ఇలా ప్రతి ఒక్కరూ జాతీయ జెండా ఎగర వేయకూడదని నబంధనలు చెబుతున్నాయి.ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 ప్రకారం తమ వాహనాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసేందుకు నిర్దిష్ట వ్యక్తులకు మాత్రమే చట్టబద్ధమైన హక్కు ఉంటుంది. వాహనంపై త్రివర్ణ పతాకాన్ని ఉంచే అధికారం ఎవరికి ఉంది..? త్రివర్ణ పతాకాన్ని ఎక్కడైనా ఎగుర వేసేటప్పుడు జెండా పైభాగంలో కాషాయం రంగు ఉండాలని జాతీయ జెండా కోడ్ చెబుతోంది. అంతే కాదు చిరిగిన లేదా మురికిగా ఉన్న జెండాను ఎగర వేయకూడదని నబంధనలు చెబుతున్నాయి.

 

జాతీయ జెండాను ఎవరి వాహనంపై ఎవరు ప్రదర్శించ వచ్చు..

ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా, 2002 లోని పేరా 3.44 ప్రకారం వాహానాలపై జాతీయ జెండాను ఎగుర వేసే హక్కు కొంత మంది వ్యక్తులకు మాత్రమే పరిమితం చేయబడింది. దేశ అధ్యక్షుడు, దేశ ఉపాధ్యక్షుడు, గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్, ఇండియన్ మిషన్ పోస్టుల అధిపతులు, ప్రధాన మంత్రి, కేబినెట్ మంత్రులు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర సహాయ మంత్రులు, ఒక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీం కోర్టు న్యాయమూర్తి, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టుల న్యాయమూర్తులు ప్రయాణించే వాహనాలకు మాత్రమే జాతీయ జెండాను ప్రదర్శించే అవకాశం ఉంటుంది.

 

నిబంధనలను ఉల్లంఘిస్తే శిక్ష ఏమిటంటి?

 

ఇక సాధారణ పౌరులకు ఇంటి దగ్గర త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయడానికి లేదంటే తమ చేతుల్లో జెండా పట్టుకుని నడవడానికి స్వేచ్ఛ ఉంటుంది. ఐతే ప్రైవేట్ వాహనాలపై జెండాలు పెట్టడం చట్టరీత్యా నేరం. ఎవరైనా ఈ నేరానికి పాల్పడితే జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం, 1971 ప్రకారం అతనిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీని ప్రకారం జాతీయ జెండా, రాజ్యాంగం, జాతీయ గీతం వంటి భారత జాతీయ చిహ్నాలను అవమానించిన వ్యక్తికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు.

 

ఇంట్లో జెండా ఎగరవేసే సమయంలో ఈ విషయాలను గుర్తుంచుకోండి.

 

నిబంధనల ప్రకారం ఏదైనా ప్రభుత్వ లేదాప్రైవేట్ సంస్థ లేదా విద్యా సంస్థ లోని సభ్యులెవరైనా ఏ రోజు, ఏ సందర్భంలో నైనా జాతీయ జెండాను ఎగుర వేయవచ్చు. ఐతే ముఖ్యమైన విషయం ఏమిటంటే జాతీయ జెండాను ఎప్పుడు ప్రదర్శించినా దానికి పూర్తి గౌరవం ఇవ్వాలి. జాతీయ జెండాను సరైన స్థలంలో ఉంచాలి. అంటే జాతీయ జెండాను నేలపై లేదా మురికి ప్రదేశంలో ఉంచరాదు. అంతేకాదు చిరిగిన లేదా మురికిగా ఉన్న జెండాను ప్రదర్శించ కూడదు. ఇంతకు ముందు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే జాతీయ జెండాను ఎగుర వేయడానికి అనుమతి ఉండేది. కానీ 2022 లో ప్రభుత్వం ఈ నిబంధనను సవరించింది. కొత్త నిబంధనల మేరకు ఇప్పుడు జెండా ఎగుర వేసేందుకు ఎలాంటి సమయ పరిమితి లేదు. సవరించిన ఫ్లాగ్ కోడ్ ప్రకారం పాలిస్టర్ క్లాత్‌తో తయారు చేసిన జెండాను ఎగుర వేయడంపై నిషేధం తొలగించ బడింది. జాతీయ జెండాను పత్తి, పాలిస్టర్, ఉన్ని, పట్టు, ఖాదీ బంటింగ్‌తో తయారు చేయవచ్చు. చేతితో నేసిన లేదా యంత్రంతో తయారు చేసిన జాతీయ జెండా లను కూడా ఉపయోగించవచ్చు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com