Monday, April 21, 2025

32 జిల్లాలు…తెగిన 587 రహదారులు….

  • తాత్కాలికంగా రహదారుల మరమ్మతులకు రూ.256 కోట్లు
  • శాశ్వత రహదారుల మరమ్మత్తులకు రూ.1200 కోట్లు
  • ప్రాథమిక నివేదికను సిద్ధం చేసిన ఆర్ అండ్ బి

రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా 32 జిల్లాల్లో 587 రహదారులు తెగిపోయినట్టు ఆర్ అండ్ బి శాఖ ప్రాథమికంగా గుర్తించింది. నిరంతరంగా వర్షాలు కురుస్తున్నందున ఈ అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ రహదారులను తాత్కాలికంగా మరమ్మత్తులు చేసేందుకు రూ.256 కోట్లు అవసరం అవుతాయని, శాశ్వత రహదారుల మరమ్మత్తులకు రూ.1200 కోట్లు అవసరం అవుతాయని ఆర్ అండ్ బి అధికారులు తాత్కాలికంగా అంచనా వేశారు. అయితే, వరదల వల్ల నష్టపోయిన రహదారుల సమాచారం ఇంకా సేకరిస్తున్నందున ఈ అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్ అండ్ బి శాఖ పేర్కొంది.

ఖమ్మంలో 16 రోడ్లు
ఖమ్మంలో 148 ఆర్ అండ్ బి రహదారులు ఉండగా భారీ వర్షాలకు 16 రోడ్లు తెగిపోవడంతో పాటు దెబ్బతిన్నాయి. సూర్యాపేటలో 27 ఆర్ అండ్ బి రహదారులు ఉండగా, భారీ వర్షాలకు 11 రోడ్లు దెబ్బతిన్నాయి. భద్రాద్రి కొత్తగూడెంలో 32 రోడ్లకు గాను 9 రోడ్లు, జనగాంలో 08 రోడ్లకు గాను 7 రోడ్లు, మహబూబాబాద్‌లో 14 రోడ్లకు గాను 7 రోడ్లు, రాజన్న సిరిసిల్లలో 14 రోడ్లకు గాను 06 రోడ్లు, నిజామాబాద్‌లో 23 రోడ్లకు గాను 05 రోడ్లు, నిర్మల్‌లో 31 రోడ్లకు గాను 03 రోడ్లు, రంగారెడ్డిలో 16 రోడ్లకు గాను 03 రోడ్లు, కరీంనగర్‌లో 17 రోడ్లకు గాను 02 రోడ్లు, జోగులాంబ గద్వాల్‌లో 05 రోడ్లకు గాను 02 రోడ్లు దెబ్బతిన్నాయి.

నాగర్‌కర్నూల్‌లో 29 ఆర్ అండ్ బి రహదారులు
నారాయణపేటలో 11 ఆర్ అండ్ బి రహదారులు ఉండగా భారీ వర్షాలకు 02 రోడ్లు తెగిపోవడంతో పాటు దెబ్బతిన్నాయి. జగిత్యాలలో 16 ఆర్ అండ్ బి రహదారులు ఉండగా భారీ వర్షాలకు 02 రోడ్లు, వికారాబాద్‌లో 22 ఆర్ అండ్ బి రహదారులు ఉండగా భారీ వర్షాలకు 02 రోడ్లు, నల్లగొండలో 04 ఆర్ అండ్ బి రహదారులు ఉండగా భారీ వర్షాలకు 01, సిద్ధిపేటలో 30 ఆర్ అండ్ బి రహదారులు ఉండగా భారీ వర్షాలకు 01 రోడ్లు, మంచిర్యాలలో 12 ఆర్ అండ్ బి రహదారులు ఉండగా భారీ వర్షాలకు 01 రోడ్లు, మహబూబ్‌నగర్‌లో 07 ఆర్ అండ్ బి రహదారులు ఉండగా భారీ వర్షాలకు 01 రోడ్లు, నాగర్‌కర్నూల్‌లో 29 ఆర్ అండ్ బి రహదారులు ఉండగా భారీ వర్షాలకు 01 రోడ్లు తెగిపోవడంతో పాటు దెబ్బతిన్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com