- పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై కేంద్రం షాక్
తెలంగాణలోని పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలోనే లేదని జల శక్తి శాఖ సహాయ మంత్రి రాజు భూషణ్ చౌదరి తెలిపారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాజ్ భూషణ్ చౌదరి ఇలా బదులిచ్చారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే ఈ ప్రాజెక్టు అంతరాష్ట్ర కృష్ణా జల వివాదం ట్రైబ్యునల్ ప్రతిపాదిత విధివిధానాల్లో చేర్చారు. కనుక నీటి వినియోగంతో ముడిపడి ఉన్న ఈ అంశం కోర్టుల పరిధిలోకి వెళ్ళింది. దాంతో పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు లెక్కలు చేపట్టడం వీలు కాదు. ఈ కారణాలతో ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనను 2024 డిసెంబర్ లోనే తిప్పి పంపించాం’ అని కేంద్రమంత్రి రాజభూషణ్ చౌదరి స్పష్టం చేశారు.
మూసి భవనాలపై కేంద్రం క్లారిటీ
తెలంగాణ ప్రభుత్వం మూసీ నది ప్రాజెక్టును చేపట్టింది. దాంతో మూసి నది పరివాహక ప్రాంతంలోని చారిత్రక భవనాలతో లోక్సభలో నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి ప్రశ్న అడిగారు. మూసి పరివాహక ప్రాంతంలోనీ చారిత్రక భవనాలు ఆర్కియా లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలో లేవని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ శాఖలోత్ స్పష్టం చేశారు. పురానాపూల్, పురాతన ద్వారం, చార్మినార్, కార్వాన్ టోలి మసీదు, బాద్ ఏ సాహి అశుర్ ఖానా, పురానాపూల్ మియా మిస్కు మసీదు, కోటి ఉమెన్స్ కాలేజీ బ్రిటిష్ రెసిడెన్సీలు తెలంగాణ ప్రభుత్వ వారసత్వ విభాగం పరిధిలోకి వస్తాయి’ అని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ తెలిపారు.