తెలుగు, తమిళ సినిమాల్లో ప్రేక్షకాదరణ పొందిన ట్యాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర అప్ కమింగ్ బైలింగ్వల్ థ్రిల్లర్ ‘లెవెల్’ లో లీడ్ రోల్ లో నటించారు. గతంలో సుందర్ సి వద్ద కలకలప్పు 2, వంద రాజవతాన్ వరువేన్, యాక్షన్ వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది. ఎ.ఆర్. ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించిన లెవెన్, విమర్శకుల ప్రశంసలు పొందిన సిలా నేరంగలిల్ సిలా మణిధర్గల్, సెంబి చిత్రాల విజయం తర్వాత వారి మూడవ వెంచర్. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వేసవిలో మే 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. రిలీజ్ డేట్ పోస్టర్ ఒక ఇంటెన్స్ కథనాన్ని ప్రజెంట్ చేస్తోంది. నవీన్ చంద్ర, శశాంక్, ఆడుకలం నరేన్ పోలీసులుగా, ముసుగు ధరించిన వ్యక్తిగా ఇంటెన్స్ ఎక్స్ ప్రెషన్ చాలా క్యురియాసిటీని పెంచుతోంది. సిలా నేరంగలిల్ సిలా మణిధర్గల్‌లో నటించిన రేయా హరి, ఎలెవెన్‌లో కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో అభిరామి, రవివర్మ, కిరీటి దామరాజు వంటి ప్రతిభావంతులైన తారాగణం కీలక పాత్రల్లో నటించించారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు డి. ఇమ్మాన్ సంగీతం అందించగా, కార్తీక్ అశోకన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.