Monday, May 19, 2025

నయన.. రూల్స్‌ బ్రేక్‌

చిరు, అనిల్ సినిమాలో నయనాల సుందరి
చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబో రూపుదిద్దుకోబోతున్న సినిమాలో నయనతార నాయికగా కన్ ఫర్మ్ అయ్యింది. మూవీ ప్రమోషన్స్ కు దూరంగా ఉండే నయనతారతో స్పెషల్ వీడియో తీసి విడుదల చేయడంలో అనిల్ రావిపూడి సక్సెస్ సాధించాడు. నిజానికి, సినిమా రంగంలో అసాధ్యం అనేది ఏదీ ఉండదు. జరగనే జరగదు అనుకునేది ఒక్కోసారి అలా అలా జరిగిపోతుంది. అయితే దేనికైనా టైమ్ రావాలి… అంతే! నయనతారను హీరోయిన్ గా తీసుకోవాలని ఓ దర్శకుడైనా అనుకోగానే… నిర్మాత చెప్పే మొదటి మాట ‘ఆమె ప్రమోషన్స్ కు రాదుగా…’ అని. అయితే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి… నయన్ యాటిడ్యూడ్ ను పూర్తిగా మార్చేశాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా ఇప్పుడు సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ఇందులో నయనతారను హీరోయిన్ గా ఎంపిక చేశారని, భారీ మొత్తాన్ని పారితోషికంగా ఇస్తున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే రెమ్యూనరేషన్ ఎంత అనేది బయటకు రాకపోయినా… ఇప్పుడు ఆమె ఈ ప్రాజెక్ట్ లో భాగమైందనేది కన్ ఫర్మ్! ఈ వివరాలను తెలియచేస్తూ… చిత్రబృందం ఓ వీడియోను విడుదల చేసింది.
మే 8వ తేదీ ఉదయం ఫ్లయిట్ లో చెన్నయ్ వెళ్ళిన అనిల్ రావిపూడి… సాయంత్రం ఫ్లయిట్ లో తిరిగి హైదరాబాద్ వచ్చేవాడు. ఈ మధ్యలో నయన్ తో ఓ స్పెషల్ వీడియోను పిక్చరైజ్ చేశాడు. ఇందులో నయనతార తెలుగులో మాట్లాడటమే కాదు… చిరంజీవి సినిమాలో తాను నటిస్తున్నానని, అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారని, ‘సంక్రాంతికి రఫ్పాడిద్దామ’ని స్వయంగా చెప్పింది. అంతేకాదు… ‘ఘరానా మొగుడు’లోని చిరంజీవి మార్క్ స్టైల్ లో ఓ ఫోజు కూడా ఇచ్చింది. ఈ సినిమాలోని పాత్రను నయనే డబ్బింగ్ చెబుతుందని అంటున్నారు. ఏదేమైనా ప్రమోషన్స్ అంటే ఆమడ దూరంలో ఉండే స్టార్ హీరోయిన్ నయనతారను మూవీ ప్రమోషన్ తోనే రంగంలోకి దింపడం అనిల్ రావిపూడికే సాధ్యమైందని అంతా కితాబిస్తున్నారు. మొన్న వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రమోషన్స్ చూసిన తర్వాత చిరంజీవి మూవీకి అంతకుమించి అనిల్ ప్రమోషన్స్ చేస్తాడని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవిని టీమ్ సభ్యులకు పరిచయం చేస్తూ ఓ వీడియోను చేసిన అనిల్ రావిపూడి ఇప్పుడు నయన్ తో చేసిన వీడియో దానిని మించి ఉందని అంటున్నారు. సినిమా ప్రమోషన్ కు నయనతార ఏమేరకు సహకరిస్తుందనే అనుమానాలకు ఈ స్పెషల్ ప్రమోషన్ వీడియోతో అనిల్ చెక్ పెట్టేశాడు. చిరంజీవి సరసన నయనతార ఇప్పటికే ‘సైరా’లో మూవీలో నటించింది, అలానే ‘గాడ్ ఫాదర్’ మూవీలో సోదరిగా చేసింది. ఆ రెండు సినిమాల ప్రమోషన్స్ కు దూరంగానే ఉన్న నయన్ ఇప్పుడీ సినిమా విషయంలో తన నిబంధనలను పక్కన పెట్టేసినట్టు అర్థమైపోతోంది. ఏదేమైనా… నయనతార ఎంట్రీ వీడియోతో ఒక్కసారిగా ప్రాజెక్ట్ కు సూపర్ హైప్ వచ్చింది.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com