Tuesday, May 13, 2025

“క” సినిమాలో సత్యభామగా ఆకట్టుకోనున్న నయన్ సారిక

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ “క” సినిమాలో హీరోయిన్ నయన్ సారిక సత్యభామగా ఆక్టటుకోనుంది. ఈ రోజు ఆమె క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. లంగావోణిలో ట్రెడిషనల్ మేకోవర్ లో నయన్ సారిక సత్యభామగా అందంగా కనిపిస్తోంది. “క” సినిమా కథలో నయన్ సారిక సత్యభామ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండనుంది.

ఈ నెల 19న సాయంత్రం 4.05 నిమిషాలకు ఫస్ట్ సింగిల్ ‘వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..’ రిలీజ్ చేయబోతున్నారు. సామ్ సీఎస్ “క” సినిమాకు ఛాట్ బస్టర్ మ్యూజిక్ చేశారు. “క” సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు.

దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌”క” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com