లేడీ సూపర్ స్టార్ వరుసపెట్టి ఉమెన్ సెంట్రిక్ చిత్రాలకు సైన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. కథ నచ్చితే చాలు అనుభవంతో పనిలేదంటూ అమ్మడు మందుకెళ్లిపోతుంది. ఇప్పటికే నాలుగైదు సినిమాలు లైన్ లో పెట్టింది. అందులో విష్ణు ఎడ్విన్ అనే కొత్త కుర్రాడు డైరెక్ట్ చేసే సినిమా ఒకటి. ఇందులో నయనతార ఏకంగా తనకన్నా ఐదేళ్లు చిన్న వాడైన నటుడితోనే రొమాన్స్ కి రెడీ అయింది. స్టోరీ డిమాండ్ మేరకు నటించాల్సి రావడంతో నయన్ మరో మాట లేకుండా డైరెక్టర్ కి ఓకే చెప్పింది. ఆ నటుడు కవిన్ రాజు. ఇతడు ఇప్పటికే నాలుగైదు సినిమాలు చేసాడు. బిగ్ బాస్ కంటెంస్ట్ గానూ ఫేమస్ అయ్యాడు. ఎడ్విన్ రాసిన పాత్రకు కవిన్ రాజ్ పర్పెక్ట్ గా సూటవ్వడంతో అతడిని ఒప్పించాడు. ప్రేమకు వయసుతో సంబంధం లేదనే కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది.
కేవలం ప్రేమ అనే కోణంలోనే హైలైట్ చేస్తూ నయన్-కవిరాజ్ పాత్రల మధ్య బలమైన బంధాన్ని చెప్పబోతున్నాడుట. అనసూయ మరో క్లారిటీ భిన్న వయసుల మధ్య ప్రేమ గెలుస్తుందా? లేదా? అన్నది హైలైట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నయన్ అతడితో కొన్ని ఘాటైన సన్నివేశాల్లోనూ నటిస్తుందని సమాచారం. ఇటీవలే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. నయన్-కవిన్ జంటగా రొమాంటిక్ గా ఉన్న ఓ ఫోటోని కూడా పంచుకున్నాడు. ఆ ఫోటో కింద కొత్త ప్రాయణం మొదలైందని రాసుకొచ్చాడు. అంటే ఈ ప్రయాణం నయనతారకి సంబంధించిందా? తన మేకింగ్ కి సంబంధించిందా? అన్నది నెటి జనులకు డౌట్.