నీట్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పలు హైకోర్టుల్లో నీట్‌పై జరిగే విచారణలపై స్టే ఇచ్చింది. నీట్ వ్యవహారంలో అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఎన్‌టీఏ కోరింది.
ఎన్‌టీఏ పిటిషన్‌పై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియను ఆపేది లేదని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది.