Monday, July 8, 2024

నీట్ ఫైట్ కంటిన్యూ సుప్రీం కోర్ట్ లో పిటిషన్ లు

నీట్‌-యజీ-2024 పరీక్షలో అవకతవకలు, పేపర్‌ లీకేజీల వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు త్వరలోనే విచారణ చేపట్టనుంది.
ఈ నేపథ్యంలో తాజాగా 56 మంది నీట్‌ ర్యాంకర్లు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నీట్‌ పరీక్షను రద్దు చేయకుండా కేంద్రంతో పాటు ఎన్‌టీఏను ఆదేశించాలని కోరారు. నీట్‌ వ్యవహారంపై ఇప్పటి వరకు 26 పిటిషన్లు దాఖలు కాగా.. వీటన్నింటినీ జులై 8న సీజేఐ నేతృత్వం లోని ధర్మాసనం విచారణ జరపనుంది.
‘‘పరీక్ష రద్దు చేయడం అనేది నిజాయతీగా, కష్టపడి చదివే విద్యార్థులకు ఎంతో నష్టం చేస్తుంది. విద్యా హక్కు ఉల్లంఘనకూ దారి తీస్తుంది. అందుకే నీట్‌-యూజీని రద్దు చేయకుండా కేంద్రంతో పాటు ఎన్‌టీఏకు ఆదేశాలివ్వాలి’’ అని గుజరాత్‌కు చెందిన సిద్ధార్థ్‌ కోమల్‌ సింగ్లాతో పాటు మరో 55 మంది విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. దీంతోపాటు మే 5న నిర్వహించిన పరీక్షలో అవక తవకలకు పాల్పడిన వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యా శాఖను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
నీట్‌-యూజీ 2024 పరీక్షలో అవకతవకలు, లీకేజీ ఆరోపణల నేపథ్యంలో ఆ పరీక్షను రద్దు చేసి మళ్లీ కొత్తగా నిర్వహించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అభ్యర్థుల్లో 1563 మందికి గ్రేస్‌ మార్కులు కలపడం, నీట్‌ను రద్దు చేయడం, ఓఎంఆర్‌ షీట్లు అందక పోవడం, న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు వంటి అంశాలపై సుప్రీం కోర్టులో దాదాపు 26 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలో జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా లతో కూడిన ధర్మాసనం జులై 8న విచారించనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?
- Advertisment -

Most Popular