Monday, May 19, 2025

దేశంలో డ్యామ్‌లు కట్టించింది నెహ్రునే

ప్రభుత్వ రంగ సంస్థలు కూడా మోడీ ప్రైవేటు చేస్తున్నారు
జూన్ 5వ తేదీ తర్వాత కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి అధికారంలోకి…
మాజీ ఎంపి వి.హనుమంతరావు

దేశంలో జూన్ 5వ తేదీ తర్వాత కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని మాజీ ఎంపి వి.హనుమంతరావు అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టినప్పుడు మన దేశంలో గుండు సూది కూడా తయారు కాలేదన్నారు. నెహ్రు, మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడిచి దేశాన్ని నడిపించాడన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పంచవర్ష ప్రణాళికలు నెహ్రు తీసుకొచ్చారని ఆయన తెలిపారు. దేశంలో డ్యామ్‌లు కట్టించింది నెహ్రు అని ఆయన అన్నారు.

మోడీ ఏమి మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదన్నారు. రాజీవ్ గాంధీ తెచ్చిన ప్రభుత్వ రంగ సంస్థలు కూడా మోడీ ప్రైవేటు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ స్వాతంత్య్రాన్ని తీసుకొచ్చిందని ఆయన అన్నారు. అంబేద్కర్ తెచ్చిన రాజ్యాంగాన్ని మోడీ మార్చాలని చూస్తున్నారని ఆయన తెలిపారు. బిజెపి నాయకులు రాముడి పేరుతో ఓట్లు అడుగుతున్నారన్నారు. అట్టడుగు వర్గాలకు న్యాయం చేయాలని రాహుల్‌గాంధీ ప్రయత్నం చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రజలు నరేంద్ర మోడీ హటావ్, దేశాన్ని బచావ్ అంటున్నార

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com