శాసనమండలి ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం పేరు ఖారారైంది. ఈమేరకు హైదరాబాద్ మఖ్దూంభవన్‌లో ఆదివారం జరిగిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయం తీసుకున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. నెల్లికంటి సత్యం సోమవారం ఉదయం 10.00 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నెల్లికంటి సత్యం నల్లగొండ జిల్లా సిపిఐ కార్యదర్శిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా వున్నారు.
కాంగ్రెస్ కు ధన్యవాదాలు
స్నేహధర్మాన్ని పాటిస్తూ ఎం.ఎల్.ఎ. కోటాలో శాసనమండలికి జరుగుతున్న ఎన్నికలలో ఒక స్థానాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)కి కేటాయించిన కాంగ్రెస్ పార్టీకి సిపిఐ రాష్ట్ర సమితి తరుఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గత శాసనసభ ఎన్నికల సమయంలో చేసుకున్న అవగాహన మేరకు తమకు స్థానాన్ని ఇచ్చినందుకు ఎఐసిసి అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనాయకులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నాటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి,
ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టిపిసిసి అధ్యక్షులు బి. మహేశ్‌కుమార్ గౌడ్, నీటి పారుదల శాఖా మాత్యులు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డిలకు, ఇందుకు సహకరించిన రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ధన్యవాదాలు. భవిష్యత్‌లో కూడా రాష్ట్రంలో మతతత్వశక్తులను అడ్డుకునేందుకు మరింత ఐక్యతతో పనిచేయాలని ఆకాంక్షిస్తున్నాము.