Saturday, March 29, 2025

నేను.. చెల్లి తేజు మా నాన్నను అపార్ధం చేసుకున్నాం

బాలకృష్ణపై ఆయన పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి చేసిన వ్యాహ్యలు ప్రస్తుతం అంతటా ఆసక్తికరంగా నిలిచాయి. ఎక్కడ చూసినా సోషల్‌ మీడియా అంతటా వైరల్‌గా మారాయి. నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన సోదరి నారా భువనేశ్వరి ఇటీవల సోదరుడికి ట్రీట్ ఇచ్చారు.

ఈ పార్టీలో నందమూరి, నారా కుటుంబ సభ్యులు పాల్గొనగా, నందమూరి బాలకృష్ణ మీద ప్రతి ఒక్కరూ తమ తమ అభిప్రాయాలు పంచుకోవాలని భువనేశ్వరి సూచించారు. ఈ క్రమంలో స్టేజీపైకి వచ్చిన నారా బ్రాహ్మణి మాట్లాడుతూ .. చిన్నతనంలో తన తండ్రిని తాను, తన సోదరి తేజు (తేజస్వి) ఇద్దరం అపార్థం చేసుకున్నామని చెప్పింది.

ఆయన ఎప్పుడూ లోపల ఒకటి, బయట ఒకటి మాట్లాడరని, లోపల ఏది అనిపిస్తే అది బయటకు అనేస్తారని, అలా మాట్లాడిన సందర్భాల్లో కొన్ని సార్లు ఏంటి అలా అంటున్నాడు? అని ఆయనను తప్పుగా అర్ధం చేసుకున్నామని చెప్పింది. అయితే ఎదిగిన తర్వాత అలా ఉండటం ఎంత అవసరమో అర్ధమైందని, అలా ఉండటం ఎంత కష్టమో కూడా తమకు తర్వాత అర్ధమైందని బ్రాహ్మణి అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com