Monday, April 21, 2025

Nepal Buss Accident: 41కి చేరిన మృతుల సంఖ్య

నేపాల్‌ బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. శుక్రవారం బస్సు నదిలోకి దూసుకెళ్లిన సంఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌ కు చెందిన టూరిస్ట్ బస్సు నేపాల్‌ లోని పొఖారా నుంచి కాఠ్‌మాండూ కు బయలుదేరారు.

తనహూ జిల్లాలోని అంబూ ఖైరేనీ ప్రాంతంలో వెళుతుండగా బస్సు ఒక్కసారిగా అదుపు తప్పింది. రొడ్డు పక్కన 150 అడుగుల లోతున వేగంగా ప్రవహిస్తున్న మార్సయాంగడీ నదిలో పడిపోయింది బస్సు. ఈ ప్రమాదంలో 16 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 25 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

 

బస్సులో డ్రైవర్ సహా ఇద్దరు సహాయకులు, 43 మంది.. మొత్తం 46 మంది ఉన్నట్లు చెబుతున్నారు. బస్సు ప్రమాదంలో చనిపోయినవారంతా మహారాష్ట్ర వాసులుగా గుర్తించారు.

మృతదేహాలను భారత్‌ కు తీసుకురావడానికి ఎయిర్‌ఫోర్స్‌ విమానం నేపాల్‌ వెళ్లనుందని అధికారులు తెలిపారు. మరో ఇద్దరు మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా వారి పరిస్థితి కూడా విషమంగానే ఉందని చెబుతున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com