Thursday, September 19, 2024

లెబనాన్ లో పేలుళ్ల తరువాత పేజర్ల గురించి సెర్చ్ చేస్తున్న నెటిజెన్స్

లెబనాన్‌ లో ఘోరం జరిగింది. పేజర్లను పేల్చడంతో పేలుళ్లు సంభవించి మొత్తం 9 మంది చనిపోయారు. సుమారు 3 వేల మంది గాయపడ్డారు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి పేజర్లను పేల్చేసినట్టు చెబుతున్నారు. పేజర్ల పేలుళ్లలో హెజ్బొల్లా ముఖ్య నేతలు, సలహాదారులు గాయపడటం, దాదాపుగా ఆ పరికరాలు అన్నీ ఒకేసారి విస్ఫోటనం చెందడాన్ని బట్టి ఇది పక్కా ప్లాన్‌తోనే జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఇటువంటి రహస్య ఆపరేషన్లలో దిట్ట అయిన ఇజ్రాయేల్‌ గూఢచర్య సంస్థలే ఈ పని చేసి ఉంటాయని చెబుతున్నారు. హెజ్బొల్లాకు లెబనాన్‌ లో సొంతంగా కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ ఉంది. ఈ గ్రూప్ టెలికం నెట్‌వర్క్‌లోకి ఇజ్రాయేల్‌ గూఢచర్య సంస్థలు చొరబడి ఉంటాయని అనుమానిస్తున్నారు. గత యేడాది అక్టోబరు నుంచి జరుగుతోన్న వరసు టార్గెట్ దాడుల్లో హెజ్బొల్లా కమాండర్లు చాలా మంది హత్యకు గురికావడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు.
ఈఘటనపై ఇజ్రాయేల్‌ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఈ దాడి ఎలా జరిగి ఉంటుందన్నదానిపై రకరకాల చర్చ జరుగుతోంది. పేజర్లలో చిన్న చిన్న ప్లాస్టిక్ పేలుడు పదార్థాలు ఉంచడం లేదా ఈ పరికరం మాదిరిగా ఉండే మినీ బాంబులను అమర్చి ఉంటారని అనుమానిస్తున్నారు. హెజ్బొల్లా నేత హసన్ నస్రల్లా గతంలో గ్రూప్ సభ్యులను సెల్‌ఫోన్‌ లను తీసుకెళ్లవద్దని హెచ్చరించారు. వారి కదలికలను ట్రాక్ చేయడానికి, దాడులకు ఇజ్రాయేల్ వాటిని ఉపయోగించవచ్చని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా సెల్ ఫోన్‌లు, కంప్యూటర్‌ల హ్యాకింగ్‌లో అత్యంత అధునాతనమైనవిగా పెగాసిస్ వంటి ఇజ్రాయేల్ ఎలక్ట్రానిక్ పరికరాలకు గుర్తింపు ఉంది. ఈ క్రమంలోనే హెజ్బొల్లా పేజర్లను వాడుతోంది. ఇప్పుడు ఇవి కూడా ఇజ్రాయేల్‌కు లక్ష్యంగా మారాయి. ఇప్పుడు పేలిన పరికరాలన్నీ కొత్త మోడళ్లేనని తెలుస్తోంది.
ఇక ఇప్పుడు లెబనాన్ లో పేజర్లు పెలిన ఘటన నేపధ్యంలో చాలా మంది ఏంటీ పెజర్లు అని గూగుల్ లో వెతుకుతున్నారు. సెల్‌ఫోన్లు రాక ముందు పేజర్ల ద్వార సమాచారం అందజేసుకునే వారు. 2000వ సంవత్సరం సమయంలో ప్రయివేట్, ఫిక్సడ్ లైన్ టెలికమ్యూనికేషన్ వ్యవస్థగా ఇవి ఉపయోగపడ్డాయి. సెల్‌ఫోన్‌ అంత పరిమాణంలో ఉండే వీటి ద్వారా అవసరమైన వారికి సమాచారం చేరవేసుకునేవారు. ముందుగా మనం ఎవరికి సమాచారం అందించాలో తెలియజేస్తూ పేజర్ల సెంటర్‌ కు కాల్‌ చేసి చెబితే.. అక్కడ ఉండే ప్రతినిధి సంబంధిత వ్యక్తి వద్ద ఉన్న పేజర్‌కు సందేశం పంపేవారు. ఈ సమాచారం అందుకున్న అవతలి వ్యక్తి అవసరమైన వారికి పబ్లిక్‌ టెలిఫోన్‌ బూత్‌ నుంచి కాల్‌ చేసి మాట్లాడేవారు. ఈ పేజర్ల ద్వారా సందేశం పంపేటప్పుడు ట్రాక్ చేయడం కుదరదు. అందుకే తమ సంభాషణలు ఎవరూ వినకుండా లెబనాన్‌లోని హెజ్బొల్లా గ్రూప్ పేజర్లను ఎక్కువగా వాడుతోందట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular