Friday, September 20, 2024

రుణమాఫీ సమాచారం కోసం కొత్తయాప్

4,24,873రైతు ఖాతాల సమాచారం సేకరణ
పంటల సాగుకోసం కోత్త రుణాలు ఇవ్వండి
బ్యాంకర్లకు మంత్రి తుమ్మల ఆదేశాలు

రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పంట రుణాల మాఫీ ప్రక్రియలో భాగంగా కుటుంబ నిర్ధారణ లేని రైతలు సమాచారాన్ని సేకరించేందుకు వీలుగా కొత్త యాప్ తీసుకువచ్చినట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.రాష్ట్ర స్థాయి వ్యవసాయాధికారులతో , కో-అపరేటివ్ అధికారులతో రుణమాఫీ పథకం 2024 గురించి క్షేత్రస్థాయిలో తలెత్తిన సమస్యలను పరిష్కరించే దిశగా చేపట్టిన చర్యలను గురించి శుక్రవారం మంత్రి అధికారులతో ఆరాతీసారు. ఇప్పటికే 2 లక్షలలోపు కుటుంబ నిర్ధారణ జరిగిన కుటుంబాలన్నింటికీ మాఫీ చేసి నందున, 2 లక్షలలోపు కుటుంబ నిర్ధారణ లేని 4,24,873 ఖాతాదారుల సమాచారాన్ని సేకరించేటందుకు వీలుగా, ఒక క్రొత్త యాప్ ను తీసుకువచ్చామని , దానిలో వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు.

వ్యవసాయాధికారులు స్వయంగా రైతుల ఇళ్ళకి వెళ్ళికాని, రైతువేదికలు , కార్యాలయాలలో గాని అందుబాటులో ఉండి ఫిర్యాధులు స్వీకరిస్తున్నట్లు తెలియజేసారు. అదే విధంగా ఆధార్ వివరాలు తప్పుగా నమోదైన 1,24,545 ఖాతాలలో ఇప్పటికే 41,322 ఖాతాలను సరిచేయడం జరిగింది. ఇప్పటికే వివిధ బ్యాంకులలో ఉన్న ఖాతాదారుల అకౌంట్ లలో ప్రభుత్వం ద్వారా జమ చేయబడిన మొత్తాలను రైతులకు అందేటట్లు చర్యలు తీసుకోవాల్సిందిగా అదేశించారు. రెన్యువల్ అయిన ఖాతాలకు సొమ్మును తిరిగి చెల్లించే విధంగా, మాఫీ అయిన ఖాతాలకు సంభందించి తిరిగి కొత్త రుణాలు మంజూరు వెంటనే చేసే విధంగా బ్యాంకు అధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టు వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 లోపు జమ చేసిన 18,000 కోట్ల రూపాయలు గాను ,10400 కోట్లు రైతులకు రుణాలు రూపంలో , నగదు రూపంలో బ్యాంకులు తిరిగి రైతులకు చెల్లించడం జరిగిందని తెలియజేసారు మిగిలి ఉన్న ఖాతాదారులకు కూడా కొత్త రుణాలు వెంటనే మంజూరు చేయవల్సిందిగా సొసైటీలకు, బ్యాంకు ప్రతినిధులకు సూచించారు. 2 లక్షలకు పైన ఉన్న ఖాతాదారులకు సంబంధించి కూడా త్వరలోనే దశల వారీగా మాఫీని వర్తింప చేస్తామని తెలియజేసారు.

అదే విధంగా సాంకేతిక కారణాలతో , కుటుంబ నిర్ధారణ జరగని రుణమాఫీ అందని రైతులు తమ దగ్గరల్లోని వ్యవసాయాధికారిని సంప్రదించడము, వారు ఇంటికి వచ్చినప్పుడు వివరాలు అందజేయవల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేశారు. అదే విధంగా వ్యవసాయాధికారులు కుటుంబ నిర్ధారణకు అవసరమైన వివరాల సేకరణ బ్యాంకర్లు తప్పుగా నమోదుచేసిన వివరాలను వెంటనే చేయవాల్సిందిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అదేశించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Lavanya Tripati New Pics

Ishita Raj Insta Hd Pics

Nabha Natash New photos