అభినందించిన పలువురు
తెలంగాణ సచివాలయం అవుట్‌సోర్సింగ్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికైంది. నూతనంగా ఎన్నికైన డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ సంఘం అధ్యక్షులు శ్రీగిరి శ్రీనివాస్ రెడ్డిని, ప్రధాన కార్యదర్శి ప్రేమ్ (దేవేందర్), తెలంగాణ సెక్రటేరియట్ ఔట్సోర్సింగ్ అధ్యక్షులు కట్ట.రమేష్, ప్రధాన కార్యదర్శి అనితను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు ఎస్. వేణుగోపాల్ రాజు, రవీందర్ నాయక్, అదనపు కార్యదర్శి ఎన్.సునీత, సి.బి.బలరాం, అనురాధ, సివి అనిల్ కుమార్, సృజన, ప్రేమ్కుమార్ లను సన్మానించారు.
అనంతరం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల గురించి వినతి పత్రం సమర్పించారు. అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలనూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, సమస్యలను పరిష్కరిస్తామన్నారు.