గూగుల్ మ్యాప్స్ లో ఈవీచార్జింగ్ స్టేషన్ల వివరాలు
గూగుల్ మ్యాప్.. ఈ టెక్నాలజీ కాలంలో మనం ఎక్కడికి వెళ్లాలన్నా దారిచూపేది గూగుల్మ్యాపే. ఒకవిధంగా చెప్పాలంటే గూగుల్ మ్యాప్ లేనిదే అడుగు తీసి అడుగు బయటపెట్టలేనిపరిస్థితి వచ్చిందంటే అతియోశక్తి కాదేమో. మనం కారు లేదంటే బైక్ పై గూగుల్ మ్యాప్ పెట్టుకొని కార్లో వెళ్లే సమయంలో ఒక్కోసారు స్ట్రైట్ గా వెళ్లాలని మ్యాప్‌లో చూపిస్తుంటుంది. కానీ ఎదురుగా ఫ్లైఓవర్, దాని పక్కనే నేరుగా సర్వీస్ రోడ్డు ఉంటుంది. అటువంటి టైంలో ఫ్లైఓవర్ పై నుంచి వెళ్లాలా లేదంటే కింది నుంచి వెళ్లాలా అనే సందేహం కలుగుతుంది. ఇదిగో ఇప్పుడు ఈ సమస్యకు గూగుల్ మ్యాప్ సరికొత్త పరిష్కారం తీసుకువచ్చింది.
గూగుల్ మ్యాప్ ఇప్పుడు ఫ్లైఓవర్ కాల్ ఔట్ పేరితో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐతే ప్రస్తుతం ఈ సదుపాయంకేవలం ఆం డ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్ ఈ వారంలోనే అందుబాటులోకి రానుండగా, ఐఓఎస్ యూజర్లకు మరికొంత సమయం పట్టనుంది. గురువారం ఫ్లైఓవర్ కాల్ ఔట్ ఫీచర్ తో పాటు మరికొన్ని ఫీచర్లనూ ప్రకటించింది గూగుల్. ఈ సరికొత్త ఫీచర్లకు సంబందించి గూగుల్ మ్యాప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితా రమణి పలు విషయాలను వెల్లడించారు.
ఫ్లైఓవర్ కాల్ ఔట్ ఫీచర్ దేశంలోని 40 నగరాల్లో అందుబాటులోకి తీసుకువస్తోంది గూగుల్. ఈ వారాం చివరలో ఆండ్రాయిడ్ మ్యాప్స్, ఆండ్రాయిడ్ ఆటో యూజర్లు అప్ డేట్ చేసుకోవచ్చు. అంతే కాకుండా ఇరుకు రోడ్లకు సంబంధించి మరో ఫీచర్‌ను సైతం గూగుల్ తీసుకొచ్చింది. కార్లలో వెళ్లేటప్పుడు రోడ్లు ఇరుకుగా ఉంటే, ఆ రూట్ ను స్కిప్ చేసిమరో రూట్ లో వెళ్లేలా గూగుల్ మ్యాప్స్ లోని కొత్త ఫీచర్ సూచించనుంది. ముందుగా భారత్ లోని 8 నగరాల్లో ఈ సదుపాయాన్ని తీసుకొస్తున్నామని గూగుల్ ప్రకటించింది. ఒకవేళ తప్పనిసరిపరిస్థితుల్లో అదే రోడ్డులో వెళ్లాల్సివస్తే మ్యాప్ లోని ఈ ఫీచర్ తగిన జాగ్రత్తలు సూచిస్తుంది.
అంతేకాకుండా విద్యుత్ వాహనాలకు సంబందించిన ఛార్జింగ్ స్టేషన్ల వివరాలను సైతంఅందించే విధంగా గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లతో పాటు ఆయా వాహనాలకు సరిపోయే పోర్టు టైప్ వంటి వివరాలను అందిస్తుందీఫీచర్. ఇక మెట్రో రైల్ టికెట్లను బుక్ చేసుకొనే మరో కొత్త ఫీచర్ ను సైతం గూగుల్ ప్రకటించింది. ముందు చెన్నై, కొచ్చిలో ఈ సదుపాయాన్నిఅందుబాటులోకి తీసుకువచ్చి, ఆ తరువాత దశలవారిగా మిగతా మెట్రోనగరాలకు విస్తరించనున్నట్లు ప్రకటించింది గూగుల్.