తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త రైలు మార్గం ఏర్పాటు కాబోతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. శుక్రవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయ తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్ష్యతన జరిగిన కేంద్ర క్యాబినెట్ భేటీలో దేశంలో మొత్తం ఎనిమిది కొత్త రైల్వేలైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది మంత్రివర్గం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్ లో ఈ కొత్త రైల్వె లైన్లు ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ ఎనిమిది రాష్ట్రాల్లోని కొత్త కైల్వే లైన్ల ప్రాజెక్టునను మొత్తం 24,657 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్నారు.
ఈ రైల్వే లైన్లకు సంబందించిన ప్రాజెక్టుల్లో భాగంగా ఒడిశాలోని మల్కన్ గిరి నుంచి తెలంగాణలోని భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు కొత్త రైల్వే లైన్ నిర్మించనున్ననారు. ఈ రైల్వే లైన్ ప్రాజెక్టు 4,109 కోట్లతో నిర్మించనుండగా మొత్తం 200.60 కిలోమీటర్ల పొడవైన లైన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ విస్తృతం చేయొచ్చని అధికారులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి, తెలంగాణలోని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలకు మేలు జరుగుతుంది చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతుందంటున్నారు. భద్రాద్రి పుణ్యక్షేత్రానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు రైలు అనుసంధానం ఉంటుందంటున్నారు.
ఇక కొత్త రైల్వే ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే అనుసంధానం పెరుగుతుంది. మహానది కోల్‌ఫీల్డ్ నుంచి మధ్య, దక్షిణ భారతంలోని విద్యుత్తు ప్లాంట్లకు బొగ్గు సరఫరా మరింత సులభమవుతుందని, అల్యూమినియం, ఇనుప ఖనిజ పరిశ్రమలకూ ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఈ కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి 1,697 హెక్టార్ల భూమి సేకరించాలని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఎనిమిది ప్రాజెక్టుల ద్వారా ఏడు రాష్ట్రాల్లో 900 కిలోమీటర్ల కొత్త లైన్లు అందుబాటులోకి వస్తాయి. మొత్తం 64 కొత్త రైల్వేస్టేషన్లు నిర్మించనుండగా, 510 గ్రామాలు, 14 జిల్లాల మీదుగా సాగే ఈ లైన్ల కారణంగా రెండు కోట్ల మందికి రైల్వే అనుసంధానత పెరుగుతుంది అధికారులు తెలిపారు.