Sunday, September 29, 2024

హైదరాబాద్ వాసులకు ఇకపై కొత్త నిబంధనలు

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రంగంలోకి పోలీసులు

హైదరాబాద్ నగరంలో జరుగుతున్న వరుస హత్యలు, దోపిడీలు, అల్లర్ల నేపధ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులను కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంతో నగరవాసులకు హైదరాబాద్ పోలీసులు కఠిన నిబంధనలను అమలు చేయబోతున్నారు. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగొద్దని, రోడ్లపై అల్లర్లు సృష్టించొద్దని పోలీసులు హెచ్చరించారు. అంతే కాదు అనుమానాస్పద వ్యక్తులకు వాహనాలపై లిఫ్ట్ ఇవ్వొద్దని పోలీసులు స్పష్టం చేశారు. ఇక నగరంలో దుకాణాలు, వ్యాపార కార్యకలాపాలను రాత్రి 10.30 నుంచి 11 గంటల్లోపు మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు గంజాయి సప్లై చేస్తున్న వారిని, గంజాయి తీసుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు పోలీసులు. అర్ధరాత్రి నగరంలో రోడ్లపై జులాయిగా ఎవరైనా తిరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈమేరకు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ తన అధికార ట్విట్టర్‌లో ఓ పోస్టర్‌ ను విడుదల చేసింది. నగరంలో బైక్ రేసింగులకు పాల్పడుతున్న పలువురు యువకులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఐనా సిటీలో ఒక్కడో ఓ చోట బైక్ రేసింగులు జరుగుతుండటంతో.. వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు సమాచారం.

హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతలకు సంబంధించి ఎలాంటి లోపం తలెత్తొద్దని సీఎం రేవంత్ రెడ్డి పోలీసులను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పోలీసులు నగరవాసులకు పలు హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై ఎవరైనా నిబంధనలను అదిగమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular